రాష్ట్రీయం

వీసా నిబంధనలు రూపొందించేప్పుడు మా ప్రత్యేకత గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13:వీసా నిబంధనలు రూపొందించేప్పుడు భారతీయుల ప్రత్యేకతను గుర్తించాలని అమెరికా, ఆస్ట్రేలియాల దృష్టికి తీసుకు వెళ్లినట్టు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్ తెలిపారు. ప్రవాసీ భారతీయుల సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సింగ్ అనంతరం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు.
భారతీయులకు ప్రత్యేకత ఉంది, వృత్తి నేపుణ్యం ఉన్నవారు, ఏ దేశంలో ఉన్న ఆ దేశ అభివృద్ధికి దోహదం చేసేవారు అనే విషయాన్ని వీసా నిబంధనలు రూపొందించేప్పుడు గుర్తించాలని అమెరికా, ఆస్ట్రేలియాలకు సూచించినట్టు చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు వీసా నిబంధన మార్పుపై ప్రశ్నించినప్పుడు మంత్రి ఈ విషయం తెలిపారు. ఇప్పటి వరకు నిబంధనల్లో ఎలాంటి మార్పు అమలులోకి రాలేదని చెప్పారు.
అమెరికా అభివృద్ధిలో భారతీయులు చేసిన కృషిని ఆ దేశం దృష్టికి తీసుకు వెళ్లాం, కొత్త వీసా నిబంధనలు రూపొందించేప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించినట్టు చెప్పారు. అమెరికా మన అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుంటుందని అన్నారు.

చిత్రం.. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్