రాష్ట్రీయం

‘కళానికేతన్’ ఎండి దంపతుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: ప్రముఖ వస్తవ్య్రాపార సంస్థ కళానికేతన్ షోరూం మేనేజింగ్ డైరెక్టర్ దంపతులను శనివారం సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు బ్యాంకుల నుంచి వారు సుమారు 7.5కోట్లు రుణాలు తీసుకున్నారు. ఎవిఎన్ రెడ్డి అనే వ్యాపారి నుంచి మూడు కోట్లు అప్పు తీసుకొని మోసం చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ లీలాకుమార్, ఆయన భార్య శారదమ్మను అదుపులోకి తీసుకున్నట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో 5 బ్యాంకులు, విజయవాడలో 2 బ్యాంకులు, గుంటూరులో ఒక బ్యాంకు మొత్తం ఎనిమిది బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్టు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఫైనాన్షియర్ ఎవిఎన్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా కళానికేతన్ యాజమాన్యం ఒకే స్థలాన్ని ఫోర్జరీ చేసి వేర్వేరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు తెలిసింది. ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకులో ఆస్తులు తనఖా పెట్టినట్టు గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే అప్రమత్తమై రిజర్వ్‌బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో కళానికేతన్ యాజమాన్యం విఫలమవడంతో నోటీసులు కూడా జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న యాజమాన్యం స్పందించకపోవడంతో ఆస్తులను జప్తు చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది. తప్పుడు పత్రాలతో బ్యాంకులను మోసం చేయడం, ఏవిఎన్‌రెడ్డి వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు కళానికేతన్ యాజమాన్యం మోసానికి పాల్పడినట్టు గుర్తించి మేనేజింగ్ డైరెక్టర్ దంపతులను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిసిఎస్ అదనపు డిసిపి విజయేందర్‌రెడ్డి తెలిపారు.
అరెస్టు అక్రమం: న్యాయవాది
కాగా, కళానికేతన్ సంస్థ అధినేత లీలాకుమార్ అరెస్టు అక్రమమని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది గీత ఆరోపించారు. ఫైనాన్షియర్ ఎవిఎన్‌రెడ్డి, కళానికేతన్ సంస్థకు చెందిన కేసు కోర్టులో ఉందని, అలాంటప్పుడు అతనిని అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. కళానికేతన్ గ్రూపునకు చెందిన రెండు బృందావన్ సిల్క్స్ షోరూంలను ఏవిఎన్ రెడ్డి కబ్జాచేసి నిర్వహించుకుంటున్నాడని న్యాయవాది వివరించారు.