రాష్ట్రీయం

ప్రవాసీలకు భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ప్రవాస భారతీయుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో పనిచేయనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికె సింగ్ తెలిపారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో పని కోసం వెళ్లిన వారు ఏజెంట్ల మోసాలవల్ల ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి విదేశీ వ్యవహారాలపై కేంద్రమే నిర్ణయం తీసుకునేది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో తొలిసారిగా స్టేట్ ఔట్ రీచ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐసిసిలో ప్రవాస భారతీయుల సమస్యలపై విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికె సింగ్ మాట్లాడారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణకు చెందినవారు పెద్ద సంఖ్యలో వివిధ దేశాల్లో ఉన్నారని, అదేవిధంగా తెలంగాణలో దేశంలోని అనేక ప్రాంతాల వారున్నారని సింగ్ తెలిపారు. ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో 86 హెడ్ పోస్ట్ఫాసులు, 800 పోస్ట్ఫాసులను దశలవారీగా పాస్ పోర్టు కేంద్రం సేవలందించే స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. పాస్‌పోర్టు జారీని సరళీకరించినట్టు చెప్పారు. తెలంగాణ కొత్త రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, డైనమిక్ స్టేట్, డైనమిక్ మినిస్టర్ అని కెటిఆర్‌ను ప్రశింసించారు. నకిలీ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో మన దేశానికి చెందిన వారు మూడు కోట్లమంది పని చేస్తున్నారని చెప్పారు. భారత ఆర్థిక ప్రగతిలో ప్రవాస భారతీయలు కీలకపాత్ర పోషిస్తున్నారని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు.
అక్రమ పాస్‌పోర్టు ఏజెంట్లపై 747 కేసులు నమోదు చేశామని కెటిఆర్ తెలిపారు. సౌదీ రెండో కాన్సలెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేంద్రానికి సూచించారు. విదేశాల్లో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకురావడంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, వికె సింగ్‌లు ప్రవాసీల సమస్యలు ట్విట్టర్‌లోనూ పరిష్కరిస్తున్నారని కెటిఆర్ తెలిపారు. ప్రవాసీయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఔట్ రీచ్ ప్రాజెక్టుతో కలిసి పని చేస్తుందని చెప్పారు. ప్రవాసీయుల సమస్యలను కెటిఆర్ ప్రస్తావించినప్పుడు పాలసీ రూపకల్పనలో ఈ అంశాలను తప్పనిసరిగా చేరుస్తామని కేంద్ర మంత్రి సింగ్ హామీ ఇచ్చారు.

చిత్రం.. ప్రవాసీయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో స్టేట్ ఔట్ రీచ్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంలో కేంద్ర మంత్రి వికె సింగ్, మంత్రి కెటిఆర్ తదితరులు