రాష్ట్రీయం

30 బ్యాంకుల్ని ముంచాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 13:్భరీ హవాలా కుంభకోణంలో సూత్రధారి వడ్డి మహేష్ కథ అనుకోని పరిస్థితుల్లో అడ్డం తిరిగింది. డొల్ల కంపెనీలను ప్రారంభించి, కోట్ల రూపాయలను జమ చేసి, పెద్ద మొత్తంలో నగదును దేశం దాటించిన మహేష్ బండారాన్ని ఐటి అధికారులు బయటపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పది బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మహేష్ హవాలా వ్యాపారానికి సహకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో జన్మించిన వడ్డి మహేష్ అనతికాలంలోనే ఎదిగి, తన హవాలా బిజినెస్‌కు కోల్‌కతాను అడ్డాగా మార్చుకున్నాడు. కోల్‌కతాకు చెందిన ఆయుష్ గోయల్, వినీత్ గోయంక, వికార్ గుప్తాతో పరిచయం ఏర్పడింది. వీరి వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తూ మహేష్ కోట్లు గడించడం మొదలుపెట్టాడు.
కోల్‌కతా, హైదరాబాద్, విశాఖలోని సుమారు 10 బ్యాంకుల్లోని అధికారులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, హెచ్‌డిఎఫ్‌సి తదితర 30 బ్యాంకుల్లో నకిలీ డాక్యుమెంట్లతో ఖాతాలు తెరిచాడు. తాను, తండ్రి వడ్డి శ్రీనివాసరావు డైరక్టర్లుగా, ఆచంట హరీష్, ఆచంట రాజేష్‌లను ఆయా కంపెనీల్లో ఉద్యోగులుగా పేర్కొంటూ 12 డొల్ల కంపెనీలను తెరమీదకు తెచ్చాడు. విశాఖలోని పాండురంగపురంలో పద్మప్రియ స్టోన్ క్రషింగ్ లిమిటెడ్, ఎంవిపి కాలనీలో బాలముకుంద వేర్ హౌసింగ్ లిమిటెడ్ పేర్లతో కార్యాలయాలు ఉన్నట్టు తప్పుడు అడ్రస్‌లతో డాక్యుమెంట్లు సృష్టించాడు. మిగిలిన 10 కంపెనీలు కోల్‌కతాలో ఉన్నట్టు డాక్యుమెంట్లు రూపొందించి, వాటి పేర్లతో అక్కౌంట్లు తెరిచాడు. ఈ కేసులో ఎ7, ఎ8, ఎ9లుగా పేర్కొన్న ఆయుష్ గోయల్, వినీత్ గోయంక, వికార్ గుప్తాలకు చెందిన 680 కోట్ల రూపాయలను ఆయా బ్యాంకుల్లో జమ చేశాడు. కోట్ల రూపాయలు తమ బ్యాంకుల్లో జమ అవుతుంటే సంబరపడిన బ్యాంకుల యాజమాన్యాలు మహేష్ అడుగులకు మడుగులు ఒత్తాయి. ఆయన ఏ డాక్యుమెంట్ తెచ్చినా, గుడ్డిగా నమ్మి, అడిగిన పని క్షణాల్లో చేసేవారు. డిపాజిట్ చేసిన మొత్తాన్ని దేశాలు దాటించేందుకు మహేష్ ప్రణాళిక రచించాడు. ఇందుకోసం ప్రశాంతకుమార్ రాయ్ బర్మన్, ప్రవీణ్ కుమార్ జాహ్ అనే ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లను రంగంలోకి దించాడు.
ఫెరా చట్టం ప్రకారం సొమ్ము బదలాయించాల్సిన వ్యక్తికి చెందిన ఇన్‌కంటాక్స్ రిటర్న్స్, పాన్ కార్డ్‌ను పరిశీలించి, సర్ట్ఫికెట్- 11ను చార్టర్డ్ అకౌంటెంట్లు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ పనిని బర్మన్, ప్రవీణ్ కుమార్ చేసిపెట్టేవారు. దీంతో 569 కోట్ల రూపాయలను, ఎటువంటి పన్ను చెల్లించకుండానే దేశం దాటించేశాడు. ఇంత మొత్తం ఒకేసారి విదేశాలకు తరలిపోవడంతో అనుమానం వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. వారం, పది రోజులుగా అత్యంత గోప్యంగా ఈ దాడులు జరిపినట్టు తెలిసింది.
ఇదిలాఉండగా మహేష్ హవాలా రాకెట్ ఉత్తరాంధ్రలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు కూడా తమ నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు మహేష్‌తో చేతులు కలిపారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. హవాలా డబ్బును సింగపూర్, థాయ్‌లాండ్ తదితర దేశాలకు మహేష్ తరలించాడన్న కథనాలు వెలుగులోకి రావడంతో ఉత్తరాంధ్ర నుంచి ఆయా దేశాలకు తరచూ రాకపోకలు జరిపిన వారిపై నిఘా పెట్టినట్టు తెలిసింది.

చిత్రం..శ్రీకాకుళం తర్లిపేటలో సర్వే నెంబర్ 1బిలో ఉన్న పద్మప్రియ స్టోన్ క్రషర్