రాష్ట్రీయం

వెలుగులు నింపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 13: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఒక సిఎం అప్‌డేట్ అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ, విద్యుత్ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలకు తన పర్యటనలో ఒక పరిష్కారం లభించిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పాదన కూడా జరుగుతున్నట్టు తెలిపారు. సోలార్ విద్యుత్ స్టోరేజ్ అవసరం అని భావించి టెస్లా కంపెనీతో సంప్రదించినట్లు చెప్పారు. మన ఇంటిపైనే సోలార్ ప్యానల్ పెట్టుకుంటే గృహావసరాలు, కార్లకు అవసరమైన ఇంధనాన్ని వినియోగించుకునే అవకాశాన్ని టెస్లా అందిస్తోందని వివరించారు. రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు 14 రూపాయలున్న యూనిట్ సౌర విద్యుత్ ధర ఇప్పుడు రూ.3.15కు పడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో రూ.2.45లకు లభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ స్టోరేజ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. తొలిదశలో వ్యవసాయ పంపుసెట్లకు వినియోగించనున్నట్లు తెలిపారు. సోలార్ ఉత్పాదకత, స్టోరేజ్‌తో రెండోదశ విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి, ఫీడర్ స్థాయి విద్యుత్ గ్రిడ్లను రూపొందిస్తామన్నారు. ఇది భారతదేశ విద్యుత్ రంగాన్ని సమూలంగా మార్చబోతున్న నిర్ణయమన్నారు. విప్లవాత్మకమైన సంస్కరణలతో విద్యుత్ ఉత్పత్తి పెంచి ధరలను తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
తన అమెరికా పర్యటనలో రెండవ కీలక ఒప్పందం అయోవా యూనివర్సిటీతో జరిగిందన్నారు. అది ఏపీలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు అన్నారు. హార్టికల్చర్, ఫిషరీస్, లైవ్ స్టాక్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలో ఉన్న ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి నెదర్లాండ్ యూనివర్సిటీ సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రపంచంలో అతి పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి రోచెస్టర్‌లోని మయో ఆస్పత్రి అని తెలిపారు. ‘పేషెంట్ ఫస్ట్’ అనే ఆశయంతో పనిచేస్తున్న ఈ సంస్థ వైద్య సేవలతోపాటు వైద్య రంగంలో విస్తృత పరిశోధనలు కూడా నిర్వహిస్తోందన్నారు. మయో స్ఫూర్తితో ప్రభుత్వం త్వరలో ‘పీపుల్స్ ఫస్ట్’ అనే నినాదాన్ని తీసుకుందని, త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీనిపై ప్రకటన చేస్తానని చెప్పారు.
సిలికానాంధ్ర యూనివర్సిటీలో మన బడి వంటి కార్యక్రమాలు బాగున్నాయన్నారు. దాన్ని అభివృద్ధి చేయడానికి రూ.6 కోట్లు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. యుఎస్‌ఐబిసి ట్రాన్స్‌ఫార్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును రాష్ట్రానికి బ్రాండింగ్ చేసే ఉద్దేశంతోనే అంగీకరించినట్లు తెలిపారు. సిస్కోలో రియల్ టైమ్ కమ్యూనికేషన్ మెకానిజం గమనించానని, రియల్ టైమ్‌లో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తమ సంస్థల ఫెర్ఫామెన్స్ రిపోర్టులు తెలుసుకునే అవకాశ సిస్కో కార్యస్థానంలో ఉన్నట్లు వివరించారు.
సెమీ కండక్టర్, డిస్‌ప్లే ఎక్విప్‌మెంట్ తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ సంస్థ అప్లయిడ్ మెటీరియల్స్ కంపెనీ సిఇవో గ్యారీ డికెరన్తోతో మాట్లాడినట్లు బాబు చెప్పారు. అప్లయిడ్ మెటీరియల్స్ కంపెనీని ఏపీతో ఎలా భాగస్వామిని చేయాలన్న అంశంపై త్వరలో రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీని క్లౌడ్ హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు న్యుటనిక్స్ కంపెనీ ముందుకొచ్చిందని చెప్పారు.
ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్ అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఐటీ దిగ్గజం జోహో సంస్థ సిఇఓ శ్రీ్ధర్ వెంబు తనను కలిశారని, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆయన ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఐటీ సేవల రంగంలో పేరొందిన, ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న అమెరికాలోని 28 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనదని, దానిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు