రాష్ట్రీయం

2 రోజుల్లో ఛేదిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 13:సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కేసును సిఐడి లేదా సిబిఐకి అప్పగించే అవకాశం ఉందని విశాఖ డిసిపి నవీన్ గులాటీ చెప్పారు. డొల్ల కంపెనీల ద్వారా రూ.690 కోట్లు బ్యాంకుల్లో జమచేసి, అదే బ్యాంకుల ద్వారా సింగపూర్, చైనా, హాంకాంగ్ తదితర దేశాలకు రూ.590 కోట్లు తరలించిన భారీ కుంభకోణం విషయాలను నగర పోలీసు కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కుంభకోణంలో పలు బ్యాంకుల పాత్ర ఉందని, మనీ ల్యాండరింగ్ తదితర చట్టాలు ఈ కేసుతో సంబంధం ఉన్న నేపథ్యంలో కేసును సిబిఐకి అప్పగించే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. శ్రీకాకుళంలో చిన్న స్టోన్ క్రషర్ యజమాని వడ్డి శ్రీనివాసరావు, అతని కుమారుడు వడ్డి మహేష్ విశాఖ, కోల్‌కతా కేంద్రాలుగా పలు డొల్ల కంపెనీలను సృష్టించి వందల కోట్ల నల్లధనాన్ని అక్రమమార్గంలో విదేశాలకు తరలించారన్నారు. విశాఖ కేంద్రంగా పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బాలముకుంద వేర్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు కోల్‌కతా కేంద్రంగా లావెండర్ ఈస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, వార్మ్‌ఫుడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫాక్స్ గ్లో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లౌడ్‌బెర్రీ సాఫ్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్, ప్రైమ్‌రోజ్ టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెరాక్ ఈస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, కౌస్తవ్ ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, డెల్ఫీనియం ఈస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డొల్ల కంపెనీలను సృష్టించారన్నారు. కోల్‌కతా, హైదరాబాద్, విశాఖ కేంద్రాలుగా పదుల సంఖ్యలోనే బ్యాంకు ఖాతాలను తెరిచారన్నారు. కంపెనీల్లో కొంతమంది బంధువులు, తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, కార్మికులను భాగస్వాములుగా చిత్రీకరించారన్నారు. వీరి హవాలా వ్యవహారం నోట్ల రద్దు అనంతరం మరింత జోరందుకుందన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుల్లో ఒకరైన వడ్డి మహేష్‌ను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. నిందితులపై 420, 120(బి), 465, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మరో రెండు రోజుల్లో కేసును ఛేదించి, మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో హవాలా కుంభకోణం వివరాలు వెల్లడిస్తున్న డిసిపి నవీన్ గులాటీ