రాష్ట్రీయం

ఏపిలో స్తంభించిన పోలీస్ కంప్యూటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 13: ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో జరిగిన సైబర్ దాడుల ప్రభావం ఏపిలో పోలీసుశాఖపై పడింది. అంతా సేఫ్ అని ఉన్నతాధికారులు చెబుతున్నా.. పోలీసు కంప్యూటర్ వ్యవస్థకు దాదాపు అంతరాయం ఏర్పడింది. హ్యాకింగ్‌కు గురైన పోలీసు కంప్యూటర్లు సుమారు 25 నుంచి 40శాతం వరకు వైరస్‌తో మొరాయించాయి. దీంతో నిపుణులు వీటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. అయితే ఈ సైబర్ దాడి ప్రభావం పోలీసుశాఖ ప్రధాన డేటా కేంద్రంపై పడలేదని నిపుణులు చెబుతున్నారు. విశాఖ, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. చిత్తూరు జిల్లాలోని తిరుమల క్రైం, తిరుపతి మహిళా పోలీస్టేషన్, ఏర్పేడు, కలికిరి, చిత్తూరు, త్రీటౌన్, అర్బన్ ఎస్పీ కార్యాలయాల్లో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలుగలేదని తిరుపతి ఎస్పీ జయలక్ష్మీ చెబుతున్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎనిమిది కంప్యూటర్లు హ్యాక్ అయినప్పటికీ సమాచారానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదన్నారు. మాన్యువల్‌లోకూడా రికార్డులు భద్రంగా ఉన్నాయన్నారు. వారంలోగా ఆన్‌లైన్ సమాచారాన్ని పునరుద్ధరిస్తామన్నారు. వాస్తవానికి శుక్రవారం తమకు సమాచారం అందగానే అర్బన్ జిల్లా పరిధిలో కంప్యూటర్లు ఆఫ్ చేసి అందరిని అప్రమత్తం చేశామని, 60 శాతం సమాచారం అప్‌డేట్‌లో ఉందన్నారు. మరో 40శాతం పూర్తిగా సేవింగ్‌లో ఉందన్నారు. పోలీసు టెక్నికల్ ఇనె్వస్టిగేషన్ వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉందని చెప్పారు.
ఇదిలావుండగా హ్యాకింగ్‌కు గురికాకుండా ముందస్తుగానే ప్రయత్నం చేశామని, కేంద్ర హోంశాఖతో మాట్లాడి నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెల్‌ను అప్రమత్తం చేశామని ఏపి పోలీసుశాఖ టెక్నికల్ అండ్ సర్వీసెస్ ఎడిజి దామోదర్ తెలిపారు. పోలీసు కానిస్టేబుళ్ళ ఫలితాల విడుదల సందర్భంగా ప్రభావం పడకుండా ప్రయత్నించామని, పోలీసు వ్యవస్థ సంప్రదాయ డేటాకు సంబంధించి ఇంకా విశే్లషించాల్సి ఉందని చెప్పారు.
ఏపి సేఫ్ : డిజిపి
తన కంప్యూటర్ హ్యాకింగ్ కాలేదని డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. తన సిస్టమ్‌లో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నందున హ్యాకింగ్‌కు గురికాలేదని, తాము సేఫ్ అని అన్నారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఎక్కువ శాతం విండోస్‌కు వాడుతున్న కంప్యూటర్లే హ్యాకింగ్‌కు గురయ్యాయన్నారు. కనెక్టెడ్ కంప్యూటర్స్‌కి హ్యాకింగ్ సమస్య ఉందని, నిన్ననే మా కంప్యూటర్లను అన్‌ప్లగ్ చేశామన్నారు. ‘్భషని తారుమారు చేసి గందరగోళం సృష్టించిన పరిస్థితులు ఎదురయ్యాయి. తిరుపతిలో మూడు ప్రాంతాల్లో, విశాఖలో సమస్య తీవ్రత గుర్తించాం. అయినా ఏపి పోలీసు సేఫ్‌గానే ఉంది. డబ్బులు కోసం మాల్‌ఫంక్షన్స్‌కు పాల్పడుతున్నారు. ఈ సమస్య అధిగమిస్తాం’ అని ఆయన చెప్పారు.