రాష్ట్రీయం

పిడుగుపాటుకు ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 14:అనంతపురం జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు గురై ఐదుగురు మరణించారు. గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో గొర్రెల కాపరులు, రైతులు గ్రామంలోని పాఠశాల సమీపంలో ఉన్న ఓ రేకులషెడ్డులోకి చేరుకున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో షెడ్డులో ఉన్న బోయ ఓబన్న (35), బోయ శివప్ప (25), జంగం జయన్న (60), కరీం (25), గిరిరెడ్డి (40) అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ గోడ కింద తలదాల్చుకున్న మరో నలుగురిపైనా కూడా పిడుగు ప్రభావం పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే మంత్రి కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఆర్‌డిఒ రామారావు హుటాహుటిన కలుగోడు గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాయదుర్గం మండలం కదరంపల్లి గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో పిడుగు పడడంతో రైతు గొల్ల పుట్టప్పకు చెందిన రూ. 50వేల విలువైన రెండు జెర్సీ ఆవులు మృత్యువాత పడ్డాయి. ఇంటి వద్ద పశువులనుకట్టివేసి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

చిత్రం..పిడుగుపడిన స్కూలు షెడ్డు ఇదే