రాష్ట్రీయం

సిఐడికి కేసు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 14: డొల్ల కంపెనీలను సృష్టించి, వందల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించిన హవాలా కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి వడ్డి మహేష్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అతనిని కోల్‌కతానుంచి ఆదివారం విశాఖకు తీసుకొచ్చారు. మహేష్‌తోపాటు అతని తండ్రి శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఆచంట హరీష్, ఆచంట రాజేష్‌లను కూడా విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. డొల్ల కంపెనీల పేరిట ఖాతాలు తెరిచిన బ్యాంకులు కేవలం 30 మాత్రమే ఉన్నాయని నిన్నటివరకూ అధికారులు చెబుతూ వచ్చినా, వాటి సంఖ్య ఇప్పుడు 42కు చేరుకుంది. కాగా విదేశాలతో లింకులు ఉన్న ఈ కేసును సిబిఐకి కాకుండా సిఐడికి అప్పగించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.