రాష్ట్రీయం

పల్లె మారుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: తెలంగాణలో పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇందుకు బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రాష్ట్రంలో 82 పట్టణాలు మాత్రమే ఉండగా వీటి సంఖ్య ప్రస్తుతం 158కి చేరుకుంది. రాష్ట్రంలో పట్టణీకరణ వృద్ధి రేటు 92.7 శాతంగా తాజా సర్వేలో తేలింది. దేశంలో ఐదవ పెద్ద నగరమైన హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని మండల కేంద్రాలు పట్టణాలుగా శరవేగంగా రూపాంతరం చెందుతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) పరిధిలోకి వచ్చాయి. హైదరాబాద్ మహానగరాన్ని మరింతగా విస్తరించడానికి పొలిమేరల్లోని గ్రామాలు, మండల కేంద్రాలను శాటిలైట్ టౌన్లుగా అభివృద్ధి పరచడానికి ఔటర్ రింగ్‌కు వెలుపల మరో రింగ్‌రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10,914 గ్రామాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 10,434కు పడిపోయింది. ఈ జాబితా నుంచి ఒక్కసారిగా 480 గ్రామాల సంఖ్య తగ్గిపోవడానికి ఇవి పట్టణాలుగా మారడమే కారణం. రాష్ట్ర ప్రణాళికశాఖ, కౌన్సిల్ ఫర్ సోషల్ డవలప్‌మెంట్ సదరన్ రీజియన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో పట్టణీకరణ రికార్డుస్థాయిలో జరుగుతున్నట్టు వెల్లడైంది. తెలంగాణలో 2001 లెక్కల ప్రకారం 82 పట్టణాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 158కి చేరుకుందని సర్వేలో తేటతెల్లమైంది. హైదరాబాద్‌కు ఉత్తర దిశగా సరిహద్దు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న మెదక్ జిల్లాలో కొత్తగా 13 పట్టణాలుగా అభివృద్ధి చెందుతుండగా, దక్షిణ దిశలో మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా 9 పట్టణాలు, పశ్చిమదిశలో రంగారెడ్డి జిల్లాలో 8 పట్టణాలు, తూర్పు దిశలో నల్లగొండ జిల్లాలో 8 పట్టణాలు మొత్తంగా 38 కొత్త పట్టణాలు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో అభివృద్ధి చెందుతున్నట్టు సర్వే పేర్కొంది. రాష్ట్రంలో పట్టణీకరణ ఒక్క హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకే పరిమితం కాలేదని, రాజధానికి సుదూరంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొత్త పట్టణాలు ఏర్పడుతున్నాయి. ఈ జిల్లాలో 2001లో 15 పట్టణాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలో పట్టణాల సంఖ్య గతంలో మూడు మాత్రమే కాగా ప్రస్తుతం 8 పట్టణాలు, కరీంనగర్ జిల్లాలో 7 పట్టణాలు ఉండగా ప్రస్తుతం 13 పట్టణాలు, మెదక్ జిల్లాలో 11 పట్టణాలు ఉండగా కొత్తగా 24 పట్టణాలు, రంగారెడ్డి జిల్లాలో 16 పట్టణాలు ఉండగా కొత్తగా 24 పట్టణాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 7 పట్టణాలు ఉండగా కొత్తగా 24 పట్టణాలు, నల్లగొండ జిల్లాలో 9 పట్టణాలు ఉండగా కొత్తగా 17 పట్టణాలు, వరంగల్ జిల్లాలో 2 పట్టణాలు ఉండగా కొత్తగా 15 పట్టణాలు, ఖమ్మం జిల్లాలో 9 పట్టణాలు ఉండగా కొత్తగా 14 పట్టణాలు అభివృద్ధి చెందుతున్నట్టు సర్వేలో తేలింది.