రాష్ట్రీయం

ఉప్పల్ కారిడార్‌కు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ఉప్పల్ నుంచి హైదరాబాద్ నగరం నడిబొడ్డుకు సులువుగా చేరుకునే వీలు కల్పించే రెండు ప్రధాన ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న అంబర్‌పేట ఫ్లై ఓవర్‌తోపాటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ప్రస్తుతం భూ సేకరణ చట్టానికి ఉన్న అడ్డంకులు తొలగడంతో ఈ రెండు ప్రాజెక్టుల భూ సేకరణను రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. సుమారు 960 కోట్ల రూపాయల వ్యయంతో ఉప్పల్ నుంచి నందనవనం భాగ్యనగర్ వరకు 6.4 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఉప్పల్ నుంచి ప్రధాన నగరానికి ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా వచ్చేందుకు వీలుగా నాలుగు లైన్లతో నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు జాతీయ ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. 950 కోట్లలో 330 కోట్ల రూపాయలు భూ సేకరణ కోసం కేటాయించారు. మిగతాది ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగిస్తారు. ఈ మేరకు ఈ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌కు ఆమోదం లభించిందని, డిపిఆర్ సిద్ధం అయిందని, ఈ నెల 17న ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెళుతున్నారని మంత్రి కెటిఆర్ చెప్పారు. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
అదేవిధంగా అంబర్‌పేట ఫ్లైఓవర్ కోసం మొత్తం 243 కోట్ల రూపాయల పనులకు కేటాయింపులు వచ్చాయని తెలిపారు. దీనిలో 130 కోట్ల రూపాయలు భూ సేకరణకు ఉపయోగించనున్నట్టు, మిగతా 110 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు ఉపయోగించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోల్నాక నుంచి రామాంతపూర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మిస్తారు. 1.4 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే భూ సేకరణ పూర్తవుతుందని, తర్వాత టెండర్లు పిలువనున్నట్టు కెటిఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రి గడ్కరీకి పలుమార్లు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని, తాను స్వయంగా గడ్కరీతో భేటీ అయ్యానని కెటిఆర్ చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి గడ్కరీకి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.