రాష్ట్రీయం

ధర్నా చౌక్ ముట్టడి నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ వివాదం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సోమవారం ‘్ఛలో ధర్నా చౌక్’కు పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాల, ప్రజా సంఘాల పిలుపునకు స్పందించిన విపక్షాల కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇందిరా పార్కు వద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించింది. పద్మవ్యూహం లాంటి దుర్భేద్యమైన పోలీసుల వ్యూహాన్ని ఛేదించుకుని ఇందిరా పార్కు వరకు చేరుకోవడం అంత సులువైన పనేమి కాదు. ఇందిరా పార్కు చుట్టూ వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అందుబాటులో ఉండడానికి పార్కు పక్కనే ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలోనూ పోలీసు బలగాలను, అశ్విక దళాలను మోహరింపజేశారు.
ఇలాఉండగా ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను ఆక్రమించుకోవడానికి టి.జెఎసి చైర్మన్ కోదండరామ్ ఇచ్చిన పిలుపును ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందిపుచ్చుకున్నాయి. నెల రోజులుగా సిపిఐ కార్యాలయం (మఖ్దూం భవన్) ఆవరణలో రిలే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కాగా సోమవారం ఇందిరా పార్కు ముట్టడికి టి.జెఎసితోపాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగానే సోమవారం ఉదయం 9.30 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అందరూ సమావేశమై ధర్నా చౌక్‌కు ర్యాలీగా వెళ్ళాలని
నిర్ణయించారు. ఈ ర్యాలీలో టి.జెఎసి చైర్మన్ కోదండరామ్, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టిటిడిపి అధ్యక్షుడు రమణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిసహా సిపిఎం, ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
ప్రతిపక్షాల వ్యూహాన్ని దెబ్బ తీసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. తొలుత ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకూ ఎవరినీ రానీయకుండా ఎక్కడికక్కడ పోలీసు అధికారులు బందోబస్తు చేశారు. ఇందిరా పార్కు దరిదాపుల్లోకి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళలేనంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. అటువైపుగా వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమైన నాయకులను తెల్లవారు జామునే అరెస్టు చేసి వారి వ్యూహాన్ని దెబ్బ తీసి కార్యకర్తలను నిరుత్సాహపరచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ధర్నా చౌక్‌ను కాపాడుకోవడానికి అఖిలపక్షం చేపట్టిన కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ధర్నా చౌక్‌ను నగరంలోనే కొనసాగించాలని ప్రభుత్వానికి తెలియజెప్పేందుకే ఈ ర్యాలీ అని ఆయన తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధుల సూచన
ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని స్వాతంత్య్ర సమరయోధులు ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నెల రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షలో భాగంగా ఆదివారం పలువురు స్వాతంత్య్ర సమరయోధులు దీక్షలో పాల్గొన్నారు.
కాగా ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను పునరుద్ధరించరాదని స్థానిక కాలనీ వాసులు, మార్నింగ్ వాకర్స్ ఆదివారం నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

చిత్రం.. ధర్నా చౌక్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు