రాష్ట్రీయం

అనంత నుంచే పోటీ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం నుంచే పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే జిల్లాలో పాదయాత్ర చేపట్టడంతో పాటు గతంలో జనసేన శిబిరంలో పాల్గొన్న వారందరినీ స్వయంగా వచ్చి కొద్ది రోజుల్లో కలుస్తానని తెలిపారు. ఆదివారం నాడిక్కడ జనసేన పార్టీ పరిపాలన కార్యాలయంలో అనంతపురం నుంచి వచ్చిన పలువురు స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టులు పవన్‌కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు అనంతపురం జిల్లాలో నెలకొన్న సమస్యలను ఆయన వివరించారు. అనంతరం పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ తన తుది శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తనను కొందరు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కానని విమర్శిస్తున్నారని అన్నారు. అసలు పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. ఒక్కో నాయకుడు వేలాది కోట్లు ఆర్జించి ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆర్జించిన మొత్తంపై కోట్లాది రూపాయలు ఆదాయం ఆర్జించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. అయితే తాను సినిమాల్లో నటించేది మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన తన సిబ్బంది కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. తనకు సినిమాలన్నా, సినీ పరిశ్రమ అన్నా అపార గౌరవం ఉందని, ప్రజాసమస్యల పరిష్కారానికి అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేసుకుంటానని వెల్లడించారు.

చిత్రం.. పవన్ కళ్యాణ్