రాష్ట్రీయం

మావోలపై ఆపరేషన్ సమాధాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: దండకారణ్యంలో సుక్మాలో 26 మంది సిఆర్‌పిఎఫ్ జవానులను మావోయిస్టులు ఊచకోత కోసిన ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎత్తున కోబ్రా కమాండోలను సిఆర్‌పిఎఫ్ మోహరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లుగా ఆపరేషన్ సమాధాన్‌కు రంగం సిద్ధమైంది. వేసవి కాలం మరో 40రోజు ల్లో ముగుస్తున్నందున, వర్షాకాలం ప్రారంభమైతే, గాలింపు చర్యలు చేపట్టడం కష్టమవుతుంది. అందుకే కేంద్ర హోం మంత్రిత్వశాఖ, కేంద్ర పోలీసు సంస్థల నిపుణుల సలహా మేరకు గాలింపు చర్యలకు పూనుకుంటున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దండకారణ్యంలోకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి సులువుగా వెళ్లే అన్ని మార్గాల్లో నిఘా వ్యవస్ధను పటిష్ఠం చేశారు. ఆపరేషన్ సమాధాన్‌లో సిఆర్‌పిఎఫ్‌కు చెం దిన కమాండ్ బెటాలియన్ ఫర్ రిజెల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలను భారీ సంఖ్యలో సమీకరించారు. ఈ దళాలు గ్రేహౌండ్స్ తరహాలో మావోయిస్టులు ఉన్న ప్రదేశంలో నిఘా సమాచారం ఆధారంగా మెరుపుదాడి చేస్తా యి. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా సరిహద్దుగా ఉన్న సుక్మా జిల్లా 2775 చ.కిమీ విస్తీర్ణం కలిగి ఉంది. 65 శాతం అడవులు ఉన్న ఈ ప్రాంతంలో కోబ్రా కమాండోలు వ్యూహాత్మకంగా ముందు కు కదులుతున్నారు.
ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు తమ ప్రాంతంలో నక్సలైట్ల కదలికలపై ఎప్పటికప్పుడు కోబ్రా దళాలకు సమాచారం అందించే విధం గా వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసుల సహాయంతో కోబ్రా దళాలు ముందుకు కదులుతున్నట్లు పోలీసు శాఖ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహా ర్, పశ్చిమబెంగాల్‌లలో కోబ్రా దళాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం 20నుంచి 25 కంపెనీల కోబ్రా దళాలు దండకారణ్యంలో సుక్మా జిల్లాను జల్లెడ పడుతున్నాయని సమాచారం.
ఒక్కో కంపెనీలో వంద మంది కోబ్రా కమాండోలు ఉంటారు. దండకారణ్యంలో చాలాకాలం నుంచి 44 బృందా ల కోబ్రా కమాండోలు పని చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 11న సుక్మా లో మావోయిస్టుల దాడిలో 11మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు, ఏప్రిల్ 24న అదే జిల్లాలో బుర్కపాల్ వద్ద జరిగిన దాడిలో 26 మంది జవాన్లు మరణించిన విషయం విదితమే.
ప్రస్తుతం కోబ్రా కమాండోలను నిర్దేశించిన ప్రాంతానికి హెలికాప్టర్లలో పంపిస్తున్నారు. ఇంతకాలం నెలకు 120 గంటల చొప్పున ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు నక్సల్స్ వేటకు సేవలు అందించేవి. తాజా వ్యూహం ప్రకారం నెలకు 160 గంటల పాటు భారత వాయుసేన హెలికాప్టర్ల సేవలను జవానులు ఉపయోగించుకుంటారు. జగదల్పూర్ కేంద్రంగా హెలికాప్టర్, మానవ రహిత ఏరియల్ వెహికిల్స్(యుఏవి)ని కూడా సైనికుల కోసం రంగంలోకి దించారు.
ఆపరేషన్ సమాధాన్ అంటే:
ఎస్ అంటే స్మార్ట్ లీడర్ షిప్, ఏ అంటే అగ్రెసివ్ స్ట్రాటేజీ (దూకుడు వ్యూహం), ఎం అంటే మోటివేషన్ అండ్ ట్రైనింగ్ (చైతన్యం, శిక్షణ), ఏ అంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ (్ఫలితాలను ఇచ్చే నిఘా సమాచారాన్ని సేకరించడం), డి అంటే డాష్ బోర్డు బేస్డ్ కీ పర్‌ఫార్మన్స్ ఇండికేటర్స్ అండ్ కీ రిజల్ట్స్ (పనితీరు సూచికలు), హెచ్ అంటే హర్నెసింగ్ టెక్నాలజీ (టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవడం), ఏ అంటే యాక్షన్‌ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్ (కార్యాచరణ), ఎన్ అంటే నో యాక్సిస్ టు ఫైనాన్సింగ్ (ఆర్థిక లావాదేవీలతో అనుసంధానాన్ని తెంపేయడం) అని అర్థం.
బలవుతున్నది పౌరులే
గణాంకాలను విడుదల చేసిన
కేంద్ర హోంశాఖ
2016లో 69 ఘటనల్లో వామపక్ష తీవ్రవాద ఘటనల్లో 66 మంది పోలీసులు, 123 మంది పౌరులు, 218 మంది నక్సలైట్లు మరణించారు. 2015లో 118 ఘటనల్లో 93 మంది పౌరులు, 57 మంది పోలీసులు, 84 మంది నక్సలైట్లు మరణించారు. 2014లో 155 ఘటనల్లో 128 మంది పౌరులు, 87 మంది పోలీసులు బలయ్యారు. 2013లో 143 ఘటనల్లో 159 మంది పౌరులు, 111 మంది పోలీసులు మరణించారు.