రాష్ట్రీయం

చేతకాని ప్రతిపక్ష నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 14: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు చేతకానివారని, అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఆదివారం విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో వారు ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలను రెచ్చగొట్టేలా అనాగరిక భాషలో మాట్లాడుతూ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మిర్చి, కంది పంటలకు గిట్టుబాటు ధర కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని తెలియని స్థితిలో ప్రతిపక్ష నేతలు ఉన్నారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికి లేదన్నారు. రాష్ట్రంలో రైతులకు నిరాటంకంగా విద్యుత్, తగిన సహాయ సహకారాలు అందించటం వల్లే ఈ ఏడాది రైతులు అధిక దిగుబడులు సాధించారన్నారు. పంటలకు కేంద్ర ప్రభుత్వం మంచి ధరను నిర్ణయించాల్సి ఉండగా ప్రతిపక్ష నేతలు రైతులను మోసగించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు. సన్నాసుల ప్రచారాలను రైతులు నమ్మరని, ప్రభుత్వం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తున్నాయో వారికి తెలుసునన్నారు. రైతులకు విద్యుత్ ఇవ్వటం సాధ్యం కాదని, రుణమాఫీ చేయటం అసాధ్యమని హేళన చేసిన వారు ఇప్పుడు నోరుమూసుకొని కూర్చోలేక పోతున్నారన్నారు. నిత్యం ప్రజలు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించేవారికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణంలో ఇంటింటికీ మంచినీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి నాణ్యమైన విద్యుత్‌ను కోతలు లేకుండా పంపిణీ చేసిన తర్వాతే తాము ఎన్నికలకు వెళతామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. సభలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కవిత, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సభలో ప్రసంగిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు