రాష్ట్రీయం

టీచర్ బదిలీలకు పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 15: ఉపాధ్యాయ బదిలీలు, హేతుబద్ధీకరణ అంశాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌పై 17న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు సమావేశమై కేంద్రాన్ని కలవనున్నట్లు మంత్రి ఈసందర్భంగా తెలిపారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలో స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 17నుంచి 23 వరకు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిచేయాలని, జూన్ 13లోగా బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణితో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉపాధ్యాయ బదిలీలపై మంగళవారం జీవో జారీ చేయాలని గంటా ఆదేశించారు. ఉపాధ్యాయ బదిలీకి వెబ్ కౌనె్సలింగ్ ఉంటుందని, బదిలీల్లో వ్యక్తిగత విజ్ఞాపనలు పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.