రాష్ట్రీయం

సిఐడి చేతికి హవాలా కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: వెయ్యి కోట్ల రూపాయల హవాలా కేసును నగర పోలీసులు సిఐడికి అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వడ్డి మహేష్‌ను సోమవారం నాలుగో అదనపుప్రధాన మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. అలాగే ఆదాయ పన్ను శాఖ తయారు చేసిన రికార్డులను కూడా కోర్టుకు సమర్పించారు. వెంటనే ఈ కేసును సిఐడికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నగరానికి చేరుకున్న అమిత్‌గార్గ్
ఇదిలా ఉండగా సిఐడి ఐజి అమిత్‌గార్గ్ సోమవారం విశాఖకు చేరుకున్నారు. స్థానిక పోలీస్ మెస్‌లో నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, డిసిపి నవీన్ గులాటితో పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కేసులో ఆదాయ పన్ను శాఖ సమర్పించిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తరువాత ఆయ న మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరన్నది నిర్థారణకు రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. మహేశ్ పాత్రపైనా స్పష్టత రావాలన్నారు.ఇదిలాఉండగా ఈ కేసు మూలాలు విదేశాల్లోనూ ఉన్నందున త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పరిధిలోకి వెళ్లనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.