రాష్ట్రీయం

దద్దరిల్లిన ధర్నా చౌక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ధర్నాచౌక్ దద్దరిల్లింది. ధర్నాచౌక్ ఆక్రమణకు ర్యాలీగా తరలివచ్చిన వామపక్షాలు స్థానికులు అడ్డుకోవడంతో ఇందిరాపార్క్ ప్రాంతం అట్టుడికింది. రెండు వర్గాలూ పోటాపోటీగా నినాదాలు, నిరసనలకు దిగడంతో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. రెండువర్గాలు బాహాబాహీకి దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోటాపోటీ ఆందోళనలతో ధర్నాచౌక్ సోమవారం అట్టుడికింది. పార్క్ వద్దనున్న ధర్నాచౌక్ తరలింపు నిర్ణయంపై వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తలెత్తిన ఆందోళనలు పరస్పర దాడులకు, తోపులాటలకు దారి తీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జితో యుద్ధవాతావరణం కనిపించింది. ధర్నాచౌక్ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా ఆందోళనకు దిగిన స్థానికులు, వాకర్స్ అసొసియేషన్ ప్రతినిధులపై ఆందోళనకారులు భౌతిక దాడులకు దిగడంతో భయానక వాతావరణం కనిపించింది. ఎవరు ఎవరిని కొడుతున్నారో, కొట్టుకుంటున్నారో తెలీని అయోమయంలోనే పలువురు గాయపడ్డారు. ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నాచౌక్ తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిలపక్షం, టిజెఏసి సోమవారం ఇచ్చిన ధర్నాచౌక్ ఆక్రమణ పిలుపునకు వేలాదిగా తరలివచ్చారు. ధర్నాచౌక్ తరలించవద్దని పరిరక్షణ సమితి, తరలించాల్సిందేనంటూ స్థానికులు ఆందోళనలకు దిగడంతో ఆ ప్రాంతం అట్టుడికింది. అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఘర్షణలు అదుపు తప్పడంతో బారికేడ్లు, ముళ్లకంచెను దాటి దాడికి పాల్పడిన స్థానికులపై వామపక్ష కార్యకర్తలు జెండా కర్రెలతో ప్రతిదాడికి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దొరికిన వారిని పిడి గుద్దులు గుద్దారు. ఇరువర్గాలు రాళ్ల దాడులకు దిగడంతో, పోలీసులు లాఠీచార్జి జరిపారు. దీంతో ధర్నాచౌక్ రణరంగమైంది. ఇరువర్గాల పరస్పర దాడుల్లో దాదాపు 25మందికి పైగా గాయపడ్డారు. పదిమందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
ఘర్షణ జరిగిందిలా..
ధర్నాచౌక్‌ను తరలించవద్దని గత నెల రోజులుగా వామపక్షం, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు దీక్ష చేపట్టాయి. ప్రభుత్వం స్పందించక పోవడంతో టిజెఏసి, అఖిలపక్షం ధర్నాచౌక్ ఆక్రమణకు పిలుపునిచ్చాయి. దీంతో సోమవారం ధర్నాచౌక్‌కు వేలాదిగా తరలివచ్చారు. అప్పటికే ధర్నాచౌక్ వద్ద స్థానికులు నిరసనలు చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు, శబ్ద కాలుష్యాన్ని భరించలేకపోతున్నామని, ధర్నాచౌక్‌ను తరలించాల్సిందేనంటూ స్థానికులు బైఠాయించారు. అయితే వేలాదిగా తరలివచ్చిన వామపక్ష, టిజెఏసి నాయకులు ర్యాలీ, సభకు పోలీస్ అనుమతిపై సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితిలో శాంతియుత ధర్నాకు అభ్యంతరం లేదని, ఈ ఒక్క రోజే అనుమతిస్తామని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ధర్నాచౌక్ వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని, స్థానికులు కూడా ధర్నాచౌక్‌ను తరలించాలని వినతి పత్రాన్ని అందించారని కమిషనర్ తెలిపారు. దీంతో ఒక్కసారిగా వామపక్ష కార్యకర్తలు బారికేడ్లు, ముళ్లకంచె దాటి ధర్నాచౌక్‌లో ధర్నాకు పూనుకున్నారు. అదేవిధంగా స్థానికులు సైతం ధర్నా చేపట్టారు. ధర్నాచౌక్‌కు అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. ముందుగా స్థానికులు వామపక్ష కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగడంతో వామపక్ష కార్యకర్తలు జెండా కర్రలతో స్థానికులను కొట్టారు. కుర్చీలు విరగ్గొట్టి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జి చేపట్టారు. ఎవరు ఎవరిపై దాడులు చేస్తున్నారో అర్థంకాని పరిస్థితిలోనే పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.
మఫ్టీ పోలీసుల దాడి
ధర్నాచౌక్ వద్ద మఫ్టీ పోలీసులు కూడా ఒక వర్గానికి మద్దతుగా వామపక్ష కార్యకర్తలపై దాడికి పాల్పడినట్టు ధర్నాచౌక్ పరిరక్షణ సమితి నాయకులు ఆరోపించారు. స్థానికులకు మద్దతుగా ఒక ఎస్‌ఐ, ఇద్దరు ఎస్‌బిలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతోపాటు మరో కానిస్టేబుల్ మఫ్టీ దుస్తుల్లో వామపక్ష కార్యకర్తలపై దాడి చేశారని మీడియాకు చెప్పడంతో మీడియా వారిని రికార్డు చేస్తుండగా పోలీసులు జారుకున్నారు. ఇదిలావుండగా ఇరువర్గాలపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ తెలిపారు.

చిత్రం.. ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగిన వామపక్ష కార్యకర్తలపై లాఠీచార్జి జరుపుతున్న పోలీసులు