రాష్ట్రీయం

20మంది నక్సల్స్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 16: నక్సల్స్‌ను ఏరివేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సమాధాన్ తొలి ఆపరేషన్ విజయం సాధించింది. బిజాపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది నక్సలైట్లు మృతిచెందినట్టు విశ్వసనీయ సమాచారం. రెడ్‌జోన్‌గా ఉన్న ఈ ప్రాంతం నుంచి నక్సల్స్‌ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇటీవల ప్రత్యేక పారా మిలటరీ దళాలను, కోబ్రా దళాలను మోహరించారు. గత వారంరోజులుగా విస్తృతంగా కూంబిగ్ జరుపుతున్న పోలీసులకు.. నక్సల్స్ పక్కా సమాచారం దొరకడంతో దాడిచేసి ప్రతీకారం తీర్చుకున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గత నెలలో పోలీసులపై నక్సలైట్లు మూకుమ్మడిగా దాడిచేసి 26మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను హతమార్చగా మంగళవారం ఘటనలో 20మంది నక్సల్స్ హతమయ్యారు. బిజాపుర్ జిల్లా రాయగుడ సమీపంలో సేదతీరుతున్న నక్సల్స్‌పై 350 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు సోమవారం ఉదయం చుట్టుముట్టి దాడిచేశారు. ఈ దాడి సమయంలో సుమారు 60మంది అక్కడ ఉన్నట్లు సమాచారం. 20మంది సంఘటనలో మృతి చెందినట్లు సిఆర్‌పిఎఫ్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరో 12మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పలువురు నక్సలైట్లు సిఆర్‌పిఎఫ్ దళాలకు చిక్కారు. కాగా, నక్సలైట్లు తొలిసారి సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కోబ్రా దళం ఉపయోగించే యూనిఫామ్‌లు వేసుకొని ఉండటం ఈ ఎన్‌కౌంటర్ ద్వారా గమనించినట్లు సిఆర్‌పిఎఫ్ ఐజి చెప్పారు.
గత నెలలో రోడ్డు నిర్మాణానికి బందోబస్తుగా ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాపుకాసి దాడిచేశారు. నాటినుంచి పోలీసులు సమయం కోసం వేచి చూస్తున్నారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లకు తోడుగా నక్సల్స్ ఏరివేతకు ఇటీవల ఆ రాష్ట్రంలోకి ప్రవేశించిన కోబ్రా దళాలు కూడా ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్టు సమాచారం. నక్సలైట్లు రాయగడ్ అటవీ ప్రాంతంలోని రెండవ గుట్ట వద్ద ఉన్నారనే పక్కా సమాచారంతోనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు, కోబ్రా దళాలు దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో పోలీసులను హతమార్చిన నాటి నుంచి మావోయిస్టులు అప్రమత్తంగా ఉంటుండగా పోలీసులు మాత్రం అదనపు బలగాలతో కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ సమాధాన్ ప్రవేశపెట్టగా తొలి విడత ఆపరేషన్‌లో పోలీసులు విజయం సాధించినట్లయింది. మావోయిస్టులకు ఎలాంటి సౌకర్యాలను అందకుండా చేయడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచి పరిస్థితిని బట్టి దాడి చేయాలనే వ్యూహంతో ముందుకెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో మావోయిస్టుల నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, వాకీటాకీలు, ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు.

చిత్రం..నక్సలైట్ల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు, ఆయుధ సామగ్రి