రాష్ట్రీయం

జిఎస్‌టి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి మూజువాణి ఓటుతో ఆమోదించాయి. కేవలం 25నిమిషాలలో జీఎస్టీ బిల్లుపై చర్చ, ఆమోద ప్రక్రియ ముగిసింది. మంగళవారం జరిగిన ఉభయ సభల సమావేశాల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బిల్లు ప్రవేశపెట్టారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఉదయం 9.45 నిమిషాలకు ప్రారంభమైంది. అంతకుముందు జరిగిన బీఏసీలో జీఎస్టీ ఆమోదం ఒక్కటే అజెండాగా నిర్ణయించారు. దానికి తాము కూడా ఆమోదం ప్రకటించామని, అయితే రైతు సమస్యలపై కూడా చర్చించాలని వైసీపీ ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పట్టుబట్టారు.
సభ ప్రారంభం అయిన వెంటనే రైతాంగ సమస్యలపై వైకాపా ముందుగా అందచేసిన వాయిదా తీర్మానంపై చర్చించాలని కోరుతూ ఆ పార్టీ సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ పోడియంపైకి ఎక్కి, స్పీకర్ చుట్టూ నిలబడి నినాదాలు చేయటం ప్రారంభించారు. అందుకు స్పీకర్ నిరాకరించారు. దానితో సభలో రసాభాస నెలకొంది. ఎవరేం మాట్లాడారో అర్థం కాని గందరగోళ పరిస్థితి కనిపించింది. బిల్లు ఆమోదం పొందేవరకు అంటే 10.40 నిమిషాల వరకు సభలో వైకాపా సభ్యుల నిరసన కొనసాగింది. సభలో బిల్లు ప్రవేశపెట్టిన యనమల రామకృష్ణుడు.. ఆ తర్వాత బిల్లుకు మద్దతు నివ్వాలంటూ సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగాలు ఈ గందరగోళం, నినాదాల మధ్య ఒక ముక్క కూడా సభలో ఎవరికీ అర్ధం కాలేదు. ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే అధికార తెలుగుదేశం, మిత్రపక్ష బిజెపి సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలతో బిల్లును ఆమోదించారు. తొలుత ముఖ్యమంత్రి
చంద్రబాబు మాట్లాడుతూ దేశ ప్రయోజనాలకు ఉద్దేశించబడిన జిఎస్‌టి బిల్లుపై ప్రతిపక్షం చర్చకు సిద్ధపడకుండా, సభను వేరే దారిలో మళ్లించే ప్రయత్నం దుర్మార్గమన్నారు. రిజిష్టర్ చేయబడిన వ్యక్తులచే చెల్లించే పన్నును స్వయంగా నిర్ధారించుకునేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. పన్ను చెల్లించటంలో వైఫల్యం చెందిన వ్యక్తి వస్తువులు చర, స్థిరాస్తులను జప్తు చేసే వీలుంటుందన్నారు. అధికారులు తనిఖీ, సోదా, స్వాధీనం, అరెస్ట్ అన్ని అధికారాలు ఉంటాయన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలుంటాయంటూ, ప్రధానంగా వినియోగదారులకు ప్రయోజనకరంగా వ్యాపారం సజావుగా సాగేందుకు, అక్రమార్జనపరుల భరతం పట్టేందుకు వీలవుతుందని జీఎస్టీ గురించి వివరించారు.
సభలో వెల్లువెత్తిన నిరసన
ఇదిలా ఉంటే సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు సభలో వైకాపా సభ్యుల నిరసన వెల్లువెత్తింది. ‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం’ ‘అవినీతిపరుడు చంద్రబాబు డౌన్ డౌన్’, ‘సీఎం విదేశీ విహారయాత్రలు-రైతు ఆత్మహత్యలు’ అంటూ పెద్ద పెట్టున నినదించారు. ఆ సమయంలో స్పీకర్ ఎంతో ఓర్పు వహించారు. వైకాపా సభ్యులు ఓ దశలో ఆహా.. ఓహో అంటూ కేకలు వేశారు.

చిత్రాలు..అసెంబ్లీలో జిఎస్‌టి బిల్లుపై మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు,
*స్పీకర్ పోడియం వద్ద వైకాపా సభ్యుల నిరసన