రాష్ట్రీయం

గేటు ఎత్తేసిన పిచ్చోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాతబస్తీ), మే 16: మతిస్థిమితం లేని ఒక వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేటు ఎత్తివేయటంతో లక్షలాది గ్యాలన్ల నీరు వృథాగా దిగువకు ప్రవహించింది. గేట్లకు మరమ్మతులు చేస్తున్న ఇరిగేషన్ సిబ్బంది పరుగు పరుగున వచ్చి పరిస్థితి చక్కదిద్దారు. అప్పటికే కనీసం 15 రోజుల పాటు రెండు నగరాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు సరిపడా నీరు వృథా పోయింది. గేట్ల మరమ్మతుల కోసం సిబ్బంది గత కొంతకాలం నుండి బ్యారేజీపైనే ఉంటున్నారు. మంగళవారం 58వ ఖానాకి సంబంధించి మరమ్మతులు చేస్తూ గేటు తీసే ఉంచారు. సిబ్బంది టీ తాగటానికి బయటకు వెళ్లిన సమయంలో బంగారుబాబు అనే మతిస్థిమితం లేని వ్యక్తి లోపలికి చొరబడ్డాడు. లోపల ఉన్న ఆకుపచ్చ స్విచ్ నొక్కటంతో గేటు
ఒక్కసారిగా పైకి లేచి, నీరు దిగువకు ప్రహహించింది. ఆ సమయంలో కింద పనులు చేస్తున్న కొందరు కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఇది గమనించిన సిబ్బంది పరుగులు తీస్తూ లోపలికి ప్రవేశించి గేటును కిందకు దించి పరిస్థితి చక్కదిద్దారు. మతిస్థిమితం లేని ఆ వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. అతడిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన బంగారు బాబు(40)గా గుర్తించారు. అతడికి మతిస్థిమితం లేదని పోలీసులు చెబుతున్నారు. సిబ్బంది బయటకు వెళ్లే ముందు గేటు తాళం వేసుంటే ఇలా జరిగి ఉండేది కాదని వన్‌టౌన్ సిఐ దాసరి కాశీవిశ్వనాధ్ అన్నారు.

చిత్రం..ప్రకాశం బ్యారేజీ గేటు ఎత్తేయటంతో దిగువకు ప్రవహిస్తున్న నీరు