రాష్ట్రీయం

కరెక్టయిన పిడుగు సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు/కుప్పం, మే 16: చిత్తూరు జిల్లాలోని కుప్పం -పలమనేరు పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పిడుగులు పడతాయని జాతీయ వివత్తు నిర్వహణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. వివత్తు శాఖ ముందస్తు హెచ్చరికలతో నష్టం తీవ్రత గణనీయంగా తగ్గింది. పిడుగుకు సంబంధించి హెచ్చరికలు వచ్చిన అర్ధగంట వ్యవధిలో కుప్పం సమీపంలోని కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో రెండు పిడుగులు పడ్డాయి. ఈ పిడుగుల వల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. ముందస్తు హెచ్చరికలతో అధికార యంత్రాగం అప్రమత్తంగా వ్యవహరించింది. జిల్లాలోని కుప్పం -పలమనేరు మండలాల్లో మంగళవారం రాత్రి వర్షంతో పాటు అధికంగా పిడుగులు పడతాయని ముందుగానే హెచ్చరించడంతో అయా ప్రాంతాల రెవెన్యూ యంత్రాంగమంతా జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పలమనేరు మండలంలోని జగమర్ల, కూర్మాయి, మోగిలి పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు రావటంతో ఆయా గ్రామాల ప్రజలు చెట్లకింద, పంట పొలాల్లో ఉండరాదని రెవెన్యూ శాఖ దండోరా ద్వారా హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లనుంచి ప్రజలు బయటకు రాకూడదని విఆర్‌ఓలు గ్రామ సేవకుల ద్వారా ప్రజలకు తెలియజేశారు. పలమనేరు, కుప్పం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రాత్రి తొమ్మిదిగంటల తర్వాత విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో పిడుగులు పడతాయన్న సమాచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే రెండు మూడు చోట్ల మాత్రమే పిడుగులు పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం రెవెన్యూ సిబ్బందిని గ్రామాల్లోనే బస చేసి అక్కడ పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. వారంరోజులుగా వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో తొలిసారిగా వివత్తుశాఖ ఈ తరహా హెచ్చరికలు చేయడంతో నష్టం తీవ్రత తగ్గే అవకాశం కలిగింది. ఒకవేళ భారీ వర్షాలు కురిసినప్పటికీ దానికి అనుగుణంగా తగు ముందస్తు చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు.