రాష్ట్రీయం

నిప్పుల కొలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/అమరావతి, మే 16: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఎండలు మండిపోయాయి. భానుడి ప్రతాపానికి జనం విలివిలలాడారు. బాపట్లలో 46.3 డిగ్రీల సెల్సియస్ నమోదై ఉభయరాష్ట్రాల్లో టాప్‌లో నిలిచింది. విజయవాడ 46.2 డిగ్రీలతో రెండోస్థానంలో నిలిచింది. విజయవాడలో ఇంత ఉష్ణోగ్రత నమోదు కావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి. ఎపి, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎండ ఎక్కువగా ఉండటంతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఉక్కపోత పోసింది. జనం మధ్యాహ్నం వేళ రోడ్లపైకి తక్కువగా వచ్చారు. సాధారణంగా రోహిణి కార్తె ప్రారంభం (మే నాలుగోవారం) లో ఎండలు అత్యధికంగా ఉంటాయి. అయితే మే మూడోవారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఆకాశంలో మేఘాలు లేకపోవడం, గాలిలో తేమ శాతం తగ్గిపోవడం తదితర కారణాలతో వడగాడ్పుల తాకిడి ఎక్కువగా ఉంది. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే నాలుగైదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. మరోమూడు రోజులపాటు సగటు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని ఐఎండి ప్రకటించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు పగటివేళ బయట తిరగడం చాలా వరకు మానివేశారు. అధిక ఉష్ణోగ్రతలతో గోదావరి జిల్లాల ప్రజానీకం అల్లాడుతున్నారు. కాల్చేసే ఎండలకు తోడు విపరీతమైన వడ గాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం రికార్డుస్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అధిక వేడికి గాల్పులు తోడవ్వడంతో పసి పిల్లలు, వృద్ధులే కాక అన్ని వయసుల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సముద్ర తీరం నుండి వేడి గాలులు వీస్తుండటంతో తీర ప్రాంతం అగ్నిగుండంగా మారింది. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప ఎండలో జనం బయటకు రావడం లేదు. తీర ప్రాంత మండలాల ప్రజలు వేడి గాలులకు అల్లాడుతున్నరు. జిల్లా కేంద్రం కాకినాడ సహా వివిధ ప్రాంతాలు అగ్నిగుండాన్ని తలపించాయి. మధ్యరాత్రి వరకు కూడా వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. సాయంత్రానికి ఎండ తగ్గుముఖం పట్టినప్పటికీ వాతావరణం చల్లబడకపోవడంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు.
అమరావతి అగ్నిగుండం!
ఎపి రాజధాని అమరావతితో సహా గుంటూరు, విజయవాడ పట్టణాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. సముద్రం తీరం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో కోస్తాతీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రి పది గంటల తర్వాత కూడా వేడి గాలులు తగ్గటం లేదు.
విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికం. ప్రకాశం జిల్లా ఉలవపాడు, శింగరాయకొండలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోత, ఎండవేడిమితో విలవిలాడిపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఉదయం పదిగంటల నుండే వేడిగాలులతో కూడిన ఎండకాయటంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. సాయంత్రం ఆరుగంటలైనా ప్రజలు బయటకు వచ్చేందుకు బెంబెలేత్తిపోయారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంల కూడా సెగ తగ్గలేదు. ఎండల కారణంగా తిరుమలలో కూడా భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
వడగాల్పులు
---------
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలలో మరోమూడురోజుల పాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుందని ఐఎండి ప్రకటించింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు హెచ్చరించాయి. ఎండలు, వడగాల్పుల కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఎపి, తెలంగాణలోని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి.