రాష్ట్రీయం

అవినీతిని ఉపేక్షించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: రాష్ట్ర ఆదాయానికి గండికొట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. అవినీతిని అరికట్టే విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ అక్కడక్కడా ఇంకా అవినీతి చోటుచేసుకుంటున్నదంటే అది గత ప్రభుత్వాల అవలక్షణమేనని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాలో నకిలీ చలాన్ల కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణించాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన నకిలీ చలాన్ల కుంభకోణంతోపాటు శాఖాపరంగా చేపట్టాల్సిన చర్యలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, డిజిపి అనురాగ శర్మ, వాణిజ్య పన్నులశాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ తదితర ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ చర్చించారు. ‘ప్రభుత్వ యంత్రాంగాన్నీ, పాలనా పద్ధతులనూ ఎంత ప్రక్షాళన చేసినప్పటికీ, మంచితనాన్ని కొందరు అలసత్వంగా తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారు’ అని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటివారిని పట్టుకుని భవిష్యత్‌లో ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను రూపొందించాలని ఆకాంక్షించారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి సాధించుకున్నాం. రాష్ట్ర ఖజానాకు సమృద్ధిగా ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖను కూడా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అన్నారు. నిజామాబాద్‌లో జరిగినటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాంటి సంఘటనలు మరెక్కడైనా జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరొచ్చిందని, రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ కూడా దేశంలో నంబర్‌వన్‌గా నిలువాలని సిఎం అన్నారు. వాణిజ్య పన్నుల శాఖతోపాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు అధికారులు ఏళ్ల తరబడిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే తిష్టవేశారని, అలాంటివారిని గుర్తించి వేరేచోటికి బదిలీ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..ఆర్థిక మంత్రి ఈటల, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్