తెలంగాణ

ఎస్‌ఆర్‌పిసి చైర్మన్‌గా దేవులపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగానికి అరుదైన గౌరవం లభించిం ది. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావును ప్రతిష్టాకరమైన సదరన్ రీజనల్ పవర్ కమిటీ చైర్మన్‌గా కేంద్రం నియమించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ అథారిటీ కార్యదర్శి ఎస్‌ఆర్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు. సదరన్ పవర్ కమిటీలో తెలంగాణతోపాటు ఆంధ్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్ఛేరి రాష్ట్రాలు సభ్యులుగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల మధ్య జరిగే విద్యుత్ పంపిణీ, విద్యుత్ గ్రిడ్ ఆపరేషన్, విద్యుత్ వినియోగం, అంతరాష్ట్ర విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రభుత్వంతో దక్షిణాది రాష్ట్రాల తరఫున సంప్రదింపులు, విద్యుత్ రంగానికి సంబంధించిన అంతర్రాష్ట్ర వివాదాలు తదితర అంశాల్లో ఎస్‌ఆర్‌పిసి కీలకంగా వ్యవహరిస్తుంది. సదరన్ పవర్ రీజనల్ కమిటీ కార్యాలయం బెంగళూరులో ఉంది. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ఎస్‌ఆర్‌పిసి చైర్మన్‌గా నియమితులు కావడాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వాగతించారు. దేవులపల్లికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఎంతో శ్రమించి కోతల్లేని విద్యుత్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రతిభకు, పనితీరుకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు రావడంపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చే ప్రక్రియలో యాదాద్రి విద్యుత్ ప్లాంటు అత్యంత ముఖ్యమైనదన్నారు. 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పపర్ ప్లాంట్‌ను రూ.27వేల కోట్ల వ్యయంతో తెలంగాణ జెన్కో చేపట్టింది. ఆర్‌ఇసి దీని కోసం రూ.21 వేల కోట్ల ఆర్ధిక సహకారం అందిస్తోంది. అన్ని రకాల అనుమతులు, ఆర్ధిక సహకారం అందుతుండటంతో యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.