జాతీయ వార్తలు

గుప్తా దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కుంభకోణంలో సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాను దోషిగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని తెస్గోరా-బి రుద్రపురి బొగ్గు క్షేత్రాన్ని కెఎస్‌ఎస్‌పిఎల్ కంపెనీకి కేటాయించడంలో అక్రమాలకు పాల్పడినందుకు గుప్తాతో పాటుగా అప్పటి బొగ్గు శాఖ జాయింట్ సెక్రటరీ కెఎస్ క్రోఫా, అప్పటి డైరెక్టర్ కెసి సమరియాలను సిబిఐ ప్రత్యేక జడ్జి భరత్ పరాశర్ దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పారు. 22న వీరికి విధించే శిక్షలను కోర్టు ప్రకటిస్తుంది. అయితే ఈ కేసులో చార్టర్డ్ అకౌంటెంట్ అమిత్ గోయల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. గుప్తా, క్రోఫా, సమరియాలతో పాటుగా కెఎస్‌ఎస్‌పిఎల్ సంస్థ, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పవ న్ కుమార్ ఆహ్లూవాలియాను కూడా జడ్జి దోషులుగా ప్రకటించింది. 2008లో పదవీ విరమణకు ముందు గుప్తా యుపిఏ హయాంలో రెండేళ్లపాటు బొగ్గు శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి అనేక అవకతవకలకు పాల్పడినట్లు గుప్తాపై ఎనిమిది వేర్వేరు చార్జిషీట్లు దాఖలయ్యాయి. కేసులన్నిటినీ కలిపి విచారించాలంటూ గుప్తా దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది కూడా.
బొగ్గు క్షేంత్రం కోసం కెఎస్‌ఎపిఎల్ దాఖలు చేసుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, అది ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేనందున దాన్ని తిరస్కరించాల్సి ఉందని కేసు విచారణ సందర్భంగా సిబిఐ తెలిపింది. అంతేకాదు కంపెనీ తన నికర విలువ, ప్రస్తుత సామర్థ్యం విషయంలో తప్పుడు లెక్కలు చూపించిందని కూడా ఆరోపించింది. అన్నిటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు క్షేత్రం కేటాయింపుకోసం కంపెనీని సిఫార్సు చేయలేదని కూడా పేర్కొంది. అయితే నిందితులు ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపు విషయంలో గుప్తా చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటుగా బొగ్గు శాఖను చూస్తున్న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌నుంచి వాస్తవాలు దాచి పెట్టారని ఆరోపిస్తూ కోర్టు గత ఏడాది అక్టోబర్‌లో ఆయనపై చార్జిషీట్ నమోదు చేసింది.