ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రాకు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెలకు రూ.10వేల ఆదాయం సంపాదించాలంటే మహిళా స్వయం సహాయక సంఘాలన్నిటికీ పునర్ వైభవం సాధింపచేయడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ, కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. ప్రతి కుటుంబం నెలకు రూ.10వేలు సంపాదించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి ముఖ్యమంత్రి తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మహిళా సంఘ కుటుంబ సభ్యురాలికి ప్రతినెలా రూ.10వేల ఆదాయం సమకూర్చడానికి సెర్ప్ ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు, టాటా ట్రస్టు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు. ఈ ప్రణాళికను ఒక నెల వ్యవధిలో పూర్తిచేయాలని, ప్రతినెలా 19వ తేదీన ఈ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉండే 9లక్షల సంఘాల్లోని 90 లక్షల మంది మహిళలకు ప్రతినెలా రూ.10వేలు ఆదాయం వచ్చే విధంగా చూడాలని ఆయన ‘సెర్ప్’ను నిర్దేశించారు. డ్వాక్రా సంఘాల్లో అక్షరాస్యత పెంచేందుకు ‘ప్రథం’ అనే సంస్థ, నైపుణ్యాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకరిస్తాయని చెప్పారు. హస్తకళల వస్తువులను విక్రయించేందుకు ఇ-మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పాల ఉత్పత్తులు, పశు సంవర్థక రంగాల్లో ఆదాయ ఆర్జనకు మార్గాలు విస్తృతంగా ఉన్నాయని, ఆయా రంగాల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న టెక్స్‌టైల్ రంగంలో రాణించేందుకు తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తయారీ రంగంలో దూసుకు వెళుతోందని గుర్తుచేస్తూ, ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా డ్వాక్రా మహిళలను సన్నద్ధం చేయాలని కోరారు. ప్రాంతాల వారీగా పొదుపు మహిళలు చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సూక్ష్మ ప్రణాళికలను తయారుచేయాలని సూచించారు. టాటా ట్రస్టు ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి అమలుచేయబోయే కార్యక్రమాలపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. పశు గణ అభివృద్ధిలో భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (బిఏఐఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ సహకరించడానికి ముందుకు వచ్చాయని సెర్ప్ సిఈవో పి.కృష్ణమోహన్ ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశంలో మహిళా సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత, సెర్ప్ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ గుప్తా, పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, వెనుకబడిన తరగతుల ప్రత్యేక కార్యదర్శి అనంతరాము, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి, మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక కమిషనర్ సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అపర్ణ, ప్రత్యేక కమిషనర్ అరుణకుమార్ పాల్గొన్నారు.

వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు