ఆంధ్రప్రదేశ్‌

సుఫల సేద్యం ధ్యేయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 19: రాష్ట్రంలో సురక్షిత సేద్యమే కాదు, సుఫల సేద్యం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం తన నివాసం నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పేదరికం నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి మన వ్యవసాయ రంగం లక్ష్యాలు కావాలన్నారు. ఉద్యానరంగంలో 30 శాతం, పాడి పరిశ్రమలో 20 శాతం, ఆక్వాలో 35 శాతం, వ్యవసాయంలో వీలైనంతగా వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు సకాలంలో అందజేసి, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఒక రైతు బిడ్డగా రాష్ట్రంలో ఏ రైతు ఇబ్బంది పడినా తాను సహించే ప్రసక్తే లేదని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పండించిన పంట అమ్ముడు పోలేదనే బాధ రాష్ట్రంలో ఏ రైతు కూడా పడకూడదన్నారు. రాష్ట్రంలో ఏ రైతుకు అన్యాయం జరగరాదన్నారు. మనం అంతా రైతు కుటుంబాల నుంచే వచ్చామంటూ, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. చివరి బస్తా కూడా కొనుగోలు చేయాలని, కష్టాల నుంచి రైతులను ఒడ్డున పడేయాలని సూచించారు. మిర్చి, పసుపు కొనుగోళ్ల పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులు కూడా రద్దుచేసి మిర్చి కొనుగోళ్లు జరపడం సంతోషకరంగా పేర్కొన్నారు. యార్డుల్లో మిర్చి కొనుగోళ్లలో శ్రమిస్తున్న హమాలీలకు బోనస్ ఇవ్వాలని, చలివేంద్రాలు నిర్వహించాలని, మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించారు. దుగ్గిరాల, కడపతో పాటు ఉదయగిరి, కంకిపాడు, నంద్యాలలో కూడా పసుపు కొనుగోళ్లు ప్రారంభించడం ముదావహమన్నారు. వేమూరులో కూడా పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే దుగ్గిరాల యార్డుపై ఒత్తిడి తగ్గుతుందని సూచించారు. ఇప్పటివరకు రూ.44 కోట్ల విలువైన 71వేల క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేశామని, 4వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చామని అధికారులు వివరించారు. గుంటూరు మిర్చి యార్డుతో పాటు మిగిలిన 5 యార్డుల్లో మిర్చి కొనుగోళ్ల పరిస్థితిని తెలియజేశారు. ఇప్పటివరకు 2.5 లక్షల క్వింటాళ్ల మిర్చిని మార్కెట్ జోక్యం కింద కొనుగోలు చేసినట్లు, 14వేల మంది రైతులు లబ్ధి పొందినట్లుగా తెలిపారు. రైతుల ఖాతాల్లో దాదాపు రూ.6 కోట్లు జమచేశారని తెలియజేయగా మిగిలింది కూడా వెంటనే జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిడుగు ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలుసుకుని ప్రాణ నష్టం నివారిస్తున్నామని, అదే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో డ్రై స్పెల్స్ ముందే గుర్తించి రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకుని పైర్లను కాపాడాలన్నదే తన ఆకాంక్షగా సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. భూగర్భ జలాల ప్రస్తుత స్థాయి 14 మీటర్ల నుంచి 8 మీటర్లకు తెస్తే దాదాపు రూ.5వేల కోట్లు ఆదా అయినట్లేనని అంకెలతో విశే్లషించారు.
‘అసాధ్యం, చేత కాదు’ అనే పదాలకు కాలం చెల్లిందన్నారు. సామర్థ్యం, నైపుణ్యం, చిత్తశుద్ధితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చన్నారు. ‘అన్న అమృత హస్తం’ కింద అంగన్‌వాడీ కేంద్రాలకు జూన్ నుంచి పాల సరఫరా చేయనున్నట్లుగా డెయిరీ డెవలప్‌మెంట్ అధికారి మురళి తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగులకు
తీపి కబురు
వారానికి ఐదు రోజుల పని పొడిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 19: వెలగపూడి సచివాలయం ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందచేసింది. సచివాలయ ఉద్యోగులు వారానికి ఐదు రోజుల మాత్రమే పని చేసేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు జూన్ 27తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పని విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.