ఆంధ్రప్రదేశ్‌

రోగులకేదీ భరోసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 20 : శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ రోగులను కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం ఆయన కవిటి మండలం జగతి గ్రామంలో ఉద్దానం కిడ్నీ రోగుల భరోసా యాత్రలో మాట్లాడారు. మరో ఏడాదిన్నరలో వైకాపా అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రతి కిడ్నీ వ్యాధిగ్రస్తునికి నెలకు 10 వేల రూపాయల పింఛను ఇస్తామని, వ్యాధి పీడిత ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని నీరుగార్చిందని విమర్శించారు. ఆసుపత్రులకు పాతబకాయిల కింద రూ. 480కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒంగోలు, కనిగిరిలో ధర్నాలు నిర్వహించామని, ఇప్పుడు జగతిలో భరోసా యాత్ర చేపట్టామన్నారు. ఎన్ని చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్మం మందం కనుక స్పందించడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. తొలుత జగన్ సభాప్రాంగణంలోని 200 మంది కిడ్నీ రోగులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. వేదికపైకి కొందరిని తీసుకొచ్చి వారితో మాట్లాడించి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ ప్రథాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర వైకాపా బిసీసెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు వి.కళావతి, కె.జోగులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ఉద్దానంలో కిడ్నీ రోగులతో
మాట్లాడుతున్న వైకాపా అధినేత జగన్