రాష్ట్రీయం

రూ.2కే సౌర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: రాష్ట్రంలో సమర్ధవంతమైన విధానాలను అమలు చేయడం ద్వారా వినియోగదారునికి నాణ్యమైన విద్యుత్‌ను చౌకగా అందించే రెండో దశ విద్యుత్ సంస్కరణలను త్వరలో ప్రారంభించనున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల రెండు రోజుల సదస్సు నేపథ్యంలో బుధవారం ఆయన అమరావతిలో ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 1998లో తొలి దశ విద్యుత్ సంస్కరణలకు తెదేపా ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకారం చుట్టిందన్నారు. ఏపీ విద్యుత్‌ను ట్రాన్స్‌కో, జెన్కో డిస్కంలుగా విభజించామని, ఆ ఫలాలు నేడు వినియోగదారులకు అందుతున్నాయన్నారు. సౌర విద్యుత్ యూనిట్ ధర రూ.2.40 పైసలకు పడిపోయిందని, భవిష్యత్‌లో యూనిట్ ధర రూ.2లకే పడిపోయే అవకాశం ఉందన్నారు. ఈ ఫలాలను గృహ, పరిశ్రమల వినియోగదారులకు అందిస్తామన్నారు. గతంలో సౌర, పవన విద్యుత్ ధరలు ఎక్కువగా ఉండేవన్నారు. ప్రపంచంలో అతి పెద్ద కర్నూలు సౌర విద్యుదుత్పత్తి ధర యూనిట్ రూ. 3.13లకే ఉందన్నారు. రాజస్తాన్‌లో యూనిట్ సౌర విద్యుత్ ధర రూ.2.44పైసలకే లభిస్తోందన్నారు. ఇకపై పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధర రూ.4కంటే తక్కువగా సరఫరా చేస్తామన్నారు. దీనికి తగినట్లుగా కార్యాచరణను సిద్ధం చేయాలని ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ రోజూ 22 ఎంయు విద్యుత్ కొరత ఉండేదన్నారు. ఈపిడిసిఎల్ పరిధిలో విజయనగరం జిల్లా మక్కువలో, ఏపిఎస్‌పిడిసిఎల్ పరిధిలో నెల్లూరు జిల్లాలో ఐదు మెగావాట్ల చొప్పున సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కెపాసిటీ 16,875 మెగావాట్లు అని, పిఎల్‌ఎఫ్ 80.71 శాతం ఉందన్నారు. నెల రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయని,వంద శాతం గృహ విద్యుద్దీకరణ చేశామన్నారు. సోలార్ విద్యుత్ సామర్థ్యం 6053మెగావాట్లు అన్నారు.