ఆంధ్రప్రదేశ్‌

రోగులపై ఒత్తిళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ టెన్షన్లతో వాళ్లకు మరింత అనారోగ్యం ‘మయో’ విధానం మనకు ఆదర్శం
ఇక నచ్చిన వైద్యునితో చికిత్స ఆస్పత్రుల్లో ‘సప్త వర్ణ’ దుప్పట్లు
సిబ్బందిలో సాఫ్ట్ స్కిల్స్ పెంచుతాం వైద్య రంగంలో మరిన్ని సంస్కరణలు
వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం స్పష్టీకరణ

అమరావతి, మే 24: ‘రాష్ట్రంలోని వైద్యులందరికీ సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. వైద్యరంగంలో సంస్కరణలు తీసుకొచ్చి సమూల మార్పులు చేస్తున్నాం. ఆ దిశగా వైద్య ఆరోగ్య సిబ్బందిలోనూ పరివర్తన ఆశిస్తున్నా. ఆసుపత్రికి వచ్చే రోగి ఎంతో టెన్షన్‌తో వస్తాడు. అతనికి అవసరమైన మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాల్సిందిపోయి నర్సులు, డాక్టర్లు ఇంటా బయటా తాము ఎదుర్కొనే టెన్షన్లను రోగిమీద చూపడం రోగికి మరింత అనారోగ్యం’ అని సిఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో ‘స్వచ్ఛ సప్త వర్ణ దుప్పట్ల’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించిన సిఎం, ప్రత్యక్ష ప్రసారం ద్వారా 13 జిల్లాల ప్రధాన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, అక్కడి వైద్య సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. అమెరికాలోని 150 ఏళ్ల ప్రఖ్యాత మయో ఆసుపత్రి మనకు ఆదర్శం కావాలని సిఎం హితవు పలికారు. ‘పేషెంట్ ఫస్ట్’ అనే నినాదానే్న విధానంగా మార్చుకున్న ఈ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు రోగులను పలకరించే విధానం, పనిచేసే పద్ధతి ఇక్కడ అందరికీ మార్గదర్శకం కావాలన్నారు. ముఖ్యంగా వైద్యులు పలకరించే తీరుతోనే రోగులకు సగం స్వస్థత కలుగుతుందని, వృత్తి నైపుణ్యంలోనే కాకుండా ప్రవృత్తి నైపుణ్యం కూడా అవసరమని గుర్తించి ఆ దిశగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించాలని నిర్ణయించామన్నారు.
రాష్ట్ర వైద్య రంగంలో వినూత్న విధానాలు తీసుకొచ్చామని, పేద వర్గాలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడానికి ఎన్నో సంస్కరణలు తెచ్చామన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యాధునిక సదుపాయాలు కల్పించడానికి ఎన్ని నిధులైనా వెనుకాడకుండా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్య పద్ధతిలో వినూత్న విధానాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. వైద్య కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ అమలు చేస్తున్నామన్నారు. తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, బసవతారకం మదర్ కిట్ వంటి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నామని వివరించారు.
సమాజంలో పేదవర్గాలు సైతం నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకోగలిగే అవకాశం త్వరలో కల్పిస్తున్నామని సిఎం చెప్పారు. ఆఖరికి చనిపోయిన వ్యక్తిని సేవాభావంతో చివరి గమ్యానికి చేర్చే ‘మహాప్రస్థానం’ వాహనాలనూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. నాలెడ్జ్ పార్టనర్, సర్వీస్ ప్రొవైడర్లను ఏర్పాటు చేసుకుని ఏపి వైద్య ఆరోగ్య రంగం దేశంలోనే ఒక ఉత్తమ నమూనాగా నిలిచిందన్నారు. త్వరలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఎగ్జిట్ ఇంటర్వ్యూ ద్వారా పేషెంట్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధానాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.
సప్త వర్ణ దుప్పట్ల కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులలో ప్రవేశ పెడుతున్నామని, ఆయా ఆసుపత్రుల్లో ఏడు రోజులూ ఏడు రంగుల అంచులతో కూడిన దుప్పట్లు మారుస్తారని వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఒక రోగికి రోజుకు రెండున్నర పర్యాయాలు దుప్పట్లు మార్చగలిగే అవకాశం అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు.
ఇండియన్ రైల్వే మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని, దుప్పట్లు మార్చడంలో శాస్ర్తియంగా అంచనా వేసి, పరీక్షలు జరిపి తుది నిర్ణయాలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు శర్మ చెప్పారు. సోమవారం ఊదా, మంగళవారం ఆరెంజ్, బుధవారం మెజెంటా, గురువారం ఆకుపచ్చ, శుక్రవారం ఇటుక రంగు, శనివారం నీలం, ఆదివారం పసుపు రంగు బోర్డర్లున్న దుప్పట్లు మార్చుతారన్నారు. కార్యక్రమంలో ఉత్తమ టెక్నాలజీ, ఉత్తమ ప్రాక్టీసులపై సహకారం అందించడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఏపి వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ కుదుర్చుకుందని వివరించారు.

చిత్రం... ప్రభుత్వాస్పత్రుల్లో స్వచ్ఛ సప్త వర్ణ దుప్పట్ల కార్యక్రమం ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు