జాతీయ వార్తలు

ఇంకా ఉన్నాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 24: పదిహేనేళ్లనాటి బాబరీ మసీదు విధ్వంసం ఘటనలో కుట్ర కేసుకు సంబంధించి బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ తదితరులపై సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం అదనపు అభియోగాలు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. వీరిపై దాఖలైన కుట్ర కేసు దర్యాప్తును పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బాబరీ ఘటనకు సంబంధించిన మరో కేసులో లొంగిపోయిన శివసేన ఎంపీ సతీష్ ప్రధాన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20వేల రూపాయల చొప్పున రెండు పూచీక్తులు, అదే మొత్తం వ్యక్తిగత జామీనుపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌కె యాదవ్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. నేడు కోర్టుకు హాజరైన ప్రధాన్ తాను లొంగిపోతున్నట్టు ప్రకటించడంతో దాన్ని అంగీకరించిన కోర్టు ఆయన్ని మొదట జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. అనంతరం బెయిల్ దరఖాస్తు చేసుకోవడంతో కోర్టు అంగీకరించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం అయోధ్యకు సంబంధించిన కుట్ర, విధ్వంస కేసుల్ని సంయుక్తంగా విచారిస్తున్న సిబిఐ కోర్టు ఇప్పటికే ఐదుగురు విశ్వహిందూ పరిషత్ నేతలకు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఆ రోజున కోర్టుకు హాజరుకాని ప్రధాన్ నేడు లొంగిపోయారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై దాఖలైన కుట్ర కేసును పునరుద్ధరించాలని ఎప్పుడైతే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందో.. దీనిపై సర్వత్రా ఉత్కంఠ తలెత్తింది. అంతకు ముందు వరకూ రాయ్‌బరేలీ కోర్టులో జరిగిన కుట్ర కేసు విచారణను కూడా లక్నో సిబిఐ కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం బదలాయించింది. నెల రోజుల్లోనే విచారణను ప్రారంభించి రెండేళ్ల కాలంలో తీర్పు వెలువరించాలని కూడా ఆదేశించింది. రాష్టప్రతి పదవికి పోటీలో ఉన్నట్టు భావిస్తున్న అద్వానీపై అదనపు అభియోగాలు దాఖలైతే దాని రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసును తేల్చకుండా పాతికేళ్లుగా ఏం చేస్తున్నారంటూ ఇటీవలే సిబిఐపై సుప్రీం కోర్టు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అద్వానీ తదితరుల ప్రాసిక్యూషన్ విషయంలో సిబిఐ సరైన రీతిలో వ్యవహరించలేదని కూడా తీవ్రస్వరంతో వ్యాఖ్యానించింది. అయోధ్వ విధ్వసం, కుట్ర కేసులను కలిపి విచారించాలని ఆదేశించిన సుప్రీం కోర్టు, విచారణ పూర్తయ్యే వరకూ న్యాయమూర్తిని కూడా మార్చడానికి వీల్లేదనీ తేల్చిచెప్పింది. అనివార్య పరిస్థితుల్లో తప్ప దైనందిన విచారణను వాయిదా వేయడమూ కుదరదని ఉద్ఘాటించింది.