రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో గాలి దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో విరుచుకు పడిన గాలివాన విధ్వంసం సృష్టించింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. గుడిసెలు, రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో మిద్దెకూలి తల్లీకూతురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. కర్నూలు, కడప జిల్లాలోనూ గాలివాన దుమారం లేపింది. గాలివాన దెబ్బకు తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు అల్లాడిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. విద్యుత్ స్తంభాలు కుప్పకూలడంతో పలు గ్రామాలు చీకటిమయమయ్యాయి. ఎర్రవల్లి నుంచి గద్వాలకు రాకపోలకు అంతరాయం కలిగింది.