ఆంధ్రప్రదేశ్‌

సాంకేతిక పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీలో రాష్ట్రం ముందుండాలి
గ్రామాల్లో పౌష్టికాహార లోపం ఉండొద్దు
ఆసుపత్రులకూ అక్రిడిటేషన్
మున్సిపాలిటీలకు ర్యాంకింగులు
కలెక్టర్ల సదస్సులో సిఎం దిశా నిర్దేశం

విజయవాడ, మే 26: రాష్ట్రంలోని గ్రామాలను పౌష్టికాహార లోపరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులను సిఎం చంద్రబాబు సూచించారు. వివిధ ఆసుపత్రుకు అక్రిడిటేషన్ ఇవ్వాలని, మున్సిపాలిటీల మధ్య పోటీతత్వం నెలకొనేందుకు ర్యాంకింగులు ప్రకటించాలని ఆదేశించారు. టెక్నాలజీలో రాష్ట్రం ముందుండాలని దిశా నిర్దేశం చేశారు. విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజైన శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, రహదారులు, భవనాలు, పంచాయితీరాజ్ తదితర శాఖలను సమీక్షించారు. మాతా శిశు మరణాలకు పౌష్టికాహార లోపం కూడా కారణమవుతోందని కొందరు కలెక్టర్లు సమావేశంలో సిఎం దృష్టికి తీసుకొచ్చారు. రక్తహీనత వల్ల కూడా గిరిజన ప్రాంతాల్లో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, గ్రామాల్లో పౌష్టికాహార లోపం నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను, మహిళలను, పెద్దలను గుర్తించాలన్నారు. అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ లోపం లేని గ్రామాలను గుర్తిస్తే అవార్డులు ప్రకటిస్తామన్నారు. మాతా శిశు మరణాలను విశే్లషించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు అందరికీ సెల్‌ఫోన్లు అందించాలని ఆదేశించారు. దీనివల్ల హాజరు తదితర అంశాలను పర్యవేక్షించే వీలుంటుందన్నారు. పాఠశాలల్లో కూరగాయల సాగు చేపట్టాలన్నారు. బాలింతలకు 200 మిల్లీమీటర్ల సాచెట్లలో పాలు సరఫరా చేయాలని సిఎం దృష్టికి కడప జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడు తీసుకొచ్చారు. వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో తరువాత చూద్దామని సిఎం అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హెల్త్ ఇండెక్స్‌పై రిపోర్ట్ కార్డును చంద్రబాబు విడుదల చేశారు.
టెక్నాలజీలో ముందుండాలి
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతిపైసాకు ఫలితాలు వచ్చినప్పుడే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రాధమ్యాలుగా కలెక్టర్లు పనిచేయాలన్నారు. టెక్నాలజీ, పోటీతత్వంతో ముందుకెళ్తున్నామన్నారు. బయోమెట్రిక్ హాజరుపై దృష్టి పెట్టాలన్నారు. మున్సిపల్ కార్యాలయాల్లో మీ-సేవ సహకారంతో సర్వీస్ సెంటర్ల ఏర్పాటుకు సిఎం అనుమతించారు. 108, 104 వాహనాల డీజిల్ బిల్లులు జాప్యం చేయొద్దని, అవసరమైతే కలెక్టర్లు ముందుగా చెల్లించి తరువాత ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చన్నారు.
68 నగర పంచాయితీల ఏర్పాటుకు చర్యలు
రాష్ట్రంలో 170 గ్రామ పంచాయితీలను కలుపుతూ 68 నగర పంచాయితీలు ఏర్పాటు చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. మచిలీపట్నం, విజయనగరం పట్టణాలను నగర పాలక సంస్థలుగా మార్చే ప్రతిపాదన ఉందని సిఎంకు ఇచ్చిన ప్రజంటేషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ స్మార్ట్ సిటీల తరహాలో మున్సిపాలిటీల మధ్య పోటీ పెట్టి, వివిధ అంశాల ఆధారంగా ర్యాంకింగ్‌లు ఇవ్వాలన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును లక్షమంది ఉపయోగిస్తున్న తరువాత ప్రారభించేందుకు సిఎం నిర్ణయించారు. పంచాయితీల నుంచి 1576 కోట్లు, ఇరిగేషన్ నుంచి 615 కోట్లు, పరిశ్రమల నుంచి 280 కోట్లు, అర్బన్ లోకల్ బాడీస్ నుంచి 130 కోట్ల రూపాయల మేర విద్యుత్ బకాయిలు రావాలని సిఎం దృష్టికి ఇంధన శాఖ అధికారులు తీసుకొచ్చారు.

కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు