ఆంధ్రప్రదేశ్‌

కార్యకర్తలకు ‘స్మార్ట్’ టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 27: 1995 నుంచీ పార్టీకి కొత్త శోభ ఇచ్చిన తమ అధినేత నాయకత్వ ప్రతిభ అమోఘమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ అభినందించింది. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల నడక, నడతను నిర్దేశించి, మహానాడుకు ప్రతి ఏటా కొత్తరూపు దిద్దుకునేలా చేశారని ప్రశంసిస్తూ తీర్మానాన్ని శనివారం ఆమోదించింది. సాంకేతిక పరిజ్ఞాన ఆలోచనతో తెలుగు రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చారని పేర్కొంది. శనివారం రాత్రి జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీ అత్యవసర సమావేశంలో మహానాడు ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు వారికి విందు ఇచ్చారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులైన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్.రమణ ఈ సందర్భంగా బాబుకు కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టగా దానిని సభ్యులు ఆమోదించారు. పరిపాలనలో పారదర్శకత, సాంకేతిక వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని కొనియాడారు. లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం చేపట్టిన సంక్షేమ నిధి వల్ల కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయిలో పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని, మనం ప్రభుత్వపరంగా చేపడుతున్న టెక్నాలజీని పార్టీలోనూ అమలు చేయాల్సి ఉందని, అందులో భాగంగా బూత్ స్థాయి కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు ఇచ్చి, అక్కడి నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకునే యోచన ఉందన్నారు. దీనిపై మీరు కూడా పరిశీలన చేయాలని సూచించారు. మహానాడు అద్భుతంగా చేశారని, ఏర్పాట్లపై అంతా సంతృప్తి వ్యక్తం చేశారని విశాఖ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా-నగర కమిటీని అభినందించారు. నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాలని, ప్రజలు నాయకుల నడవడికను గమనిస్తుంటారన్న విషయాన్ని విస్మరించకూడదని బాబు హెచ్చరించారు.