తెలంగాణ

రిజిస్ట్రేషన్ గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: రాజధానిలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. అత్యంత సంపన్న ప్రాంతమైన కూకట్‌పల్లి సమీపంలో సుమారు అయిదువేల కోట్ల రూపాయల విలువైన భూమిని సాక్షాత్తూ సబ్‌రిజిస్ట్రారే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ గోల్‌మాల్ వ్యవహారానికి సంబంధించి ఆదివారం ఓ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు భవన నిర్మాణ సంస్థకు చెందిన మరో ఇద్దరిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వానికి చెందిన నాలుగు సర్వే నెంబర్ల లోని 693 ఎకరాల 4గుంటల భూమిని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేశారు. వీటితో ప్రభుత్వానికి రూ.587కోట్ల రాబడికి గండి పడింది. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ ఎన్.సైదిరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కూకట్‌పల్లి పోలీసులు కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు(56), ట్రినిటి ఇన్‌ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పిఎస్ పార్ధసారథి (60), గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్, ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్ పివి శర్మ (72)ను పోలీసులు అరెస్టు చేశారు. భూ కుంభకోణంలో పాత్రధారులైన మరి కొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మియాపూర్ సర్వే 101లో 231 ఎకరాల ప్రభుత్వ భూమిని డాక్యుమెంట్ నెంబర్ 472/2016 ద్వారా, డాక్యుమెంట్ నెంబర్ 474/2016 ద్వారా సర్వే 20లోని 109 ఎకరాల 18 గుంటల భూమి, డాక్యుమెంట్ నెంబర్ 475/2016 ద్వారా సర్వే నెంబరు 28లోని 145 ఎకరాల 26 గుంటల భూమి, సర్వే నెంబరు 100లో 207 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ట్రినిటి ఇన్‌ఫ్రా సంస్థకు రిజిస్ట్రేషన్ చేశాడు. కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ప్రొవిజన్ 22ఎ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908, సెక్షన్ 82 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్టు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంతో రూ.587.11కోట్లు నష్టం వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు పిఎస్ పార్ధసారథి, మరి కొందరు కలిసి అమీరున్నీసా బేగంతో పాటు మరో ఏడుగురి ద్వారా 2016 జనవరి 15న జిపిఎ తీసుకున్నారు. సదరు భూమిని ఏడు రోజుల్లోనే సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ పేరున 2016 జనవరి 21న రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు రిజిస్ట్రేషన్ చేసిన సర్వే నెంబర్లలోని భూములు ప్రభుత్వానికి చెందినవిగా రికార్డుల్లో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే భూకబ్జాదారులతో చేతులు కలిపి చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ భూములు పొరంబోకు, ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ శేరిలింగంపల్లి మండల డిప్యూటీ కలెక్టర్ ఫైల్ నెంబర్ బి/322/2007 సంవత్సరంలో సబ్‌రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు మెమో కూడా పంపించినట్టు పోలీసులు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇవి ప్రభుత్వ భూములు అని తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖలోని కొన్ని లొసుగులను ఆసరా చేసుకుని సబ్ రిజిస్ట్రార్ ఓ పథకం ప్రకారం అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసి విలువైన పలు డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సెక్షన్ 82 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్టు 1908తో పాటు పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మే 25న కేసు నమోదు చేసినప్పటికీ 27న నిందితులను అరెస్టు చేసినట్లు ప్రెస్‌నోట్‌లో వెల్లడించినా, 28వ తేదీ వరకు కూడా మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.