ఆంధ్రప్రదేశ్‌

కౌలు రైతుకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 28: రాష్ట్రంలో రైతులు, కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నట్టు సిఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆదివారం మహానాడులో వ్యవసాయరంగంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు వ్యవసాయంపై శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. రైతులకు కల్పిస్తున్న సౌలభ్యాల్లో భాగంగా పచ్చగడ్డిని ప్యాక్ చేసి రైతుల ఇళ్లకే పంపిస్తానని చంద్రబాబు చెప్పారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పాదకశక్తిని పెంచే అన్ని అవకాశాలు ఏపిలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. ఇందుకోసం 6000 మంది ఎంపిఓలను నియమించామని తెలియచేశారు. ఒంగోలు జాతి పశువులను, నెల్లూరు పొట్టేళ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు. కర్నూలులో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేయడానికి అమెరికా యూనివర్శిటీ ముందుకు వచ్చిందని ఆయన తెలియచేశారు.ప్రపంచం మొత్తానికి విత్తనాలు ఇక్కడి నుంచే పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన తెలియచేశారు. వ్యవసాయ రంగంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆధునిక పద్ధతులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానని ఆయన తెలియచేశారు. రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ యూనిట్‌లను 20 లక్షల వరకూ ఏర్పాటు చేశామని, వీటిని ప్రతి సంవత్సరం ఏడు నుంచి 10 లక్షలకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలియచేశారు. అలాగే మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ యూనిట్‌లను కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలియచేశారు.
పోలవరంతోనే కరవు దూరం
నదుల అనుసంధానంతోనే రాష్ట్రంలో కరవును దూరం చేయగలమని, ఈ బృహత్ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం సమర్ధంగా పూర్తి చేస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి - పోలవరం అంశంపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృథాగా సముద్రంలో కలుస్తున్న 3వేల టిఎంసిల గోదావరి జలాలను మళ్లించడం ద్వారా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కరవును పారదోలేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్రానికి కోట్ల పెట్టుబడులు
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు అన్నారు. ఏపిలో పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు అన్న తీర్మానాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత చంద్రబాబు మాట్లాడుతూ, ఏపిలో 15 లక్షల కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలతో ఎంఓయులు చేసుకున్నామని ఆయన తెలియచేశారు. దీనివలన 31 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. చాలా పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదని, నీతిమాలిన నేతల వలన రాష్ట్రం నష్టపోయిందని ఆయన అన్నారు. వారి వలన ఏపి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన పరిశ్రమలు తప్ప, కొత్త పరిశ్రమను ఒక్కటి కూడా తీసుకురాలేకపోయారని చంద్రబాబు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపి నెంబర్‌గా ఉందని ఆయన చెప్పారు.
పంచాయతీలకు రేటింగ్
స్వచ్ఛత పాటిస్తూ, సంపద వృద్ధి చేసుకుని పురోగతి సాధించే పంచాయతీలు, మున్సిపల్ వార్డులకు రేంటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు సిఎం వెల్లడించారు. వౌలిక సదుపాయాలు, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల అభివృద్ధి అంశంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన మాట్లాడారు. తీర్మానాన్ని బలపరచిన అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ కార్పొరేషన్ నుంచి టిడిపి తరపున గెలుపొందిన ప్రతిమ బెనర్జీ స్మార్ట్ విలేజ్ తీర్మానంపై ప్రసంగించారు.
...............

చిత్రం... మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు