ఆంధ్రప్రదేశ్‌

బిజెపిలోకి కవిత? టిడిపికి రాజీనామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 28: ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం పార్టీ మహిళా నేత కవిత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సినిమాలను కూడా వదులుకుని, పార్టీకి పనిచేసిన తనను అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కకుపెట్టి అవమానిస్తున్నారంటూ ఆమె గత కొంతకాలం నుంచీ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజా మహానాడుకు వచ్చిన ఆమెను వేదిక ఎక్కనీయకుండా నిర్వహకులు అడ్డుకోవడంతో ఆవేదన చెందిన కవిత పార్టీకి సినిమా నటులంటే పడదని, ప్రతిపక్షంలో ఉండగా వేదిక ఎక్కించారని , అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పనికిరాకుండా పోయానో పార్టీనే చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీకి పనిచేసి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయిన తనను ఇప్పుడు మానసికంగా కూడా అవమానించారని, అన్నింటికీ దేవుడున్నాడని కన్నీళ్లపర్యంతరమయ్యారు. ఈ నేపథ్యంలో కవిత బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆమెతో గత కొద్దికాలం క్రితమే బిజెపి జాతీయ నేత ఒకరు, అంతకంటే ముందు ఏపికి చెందిన మరో రాష్ట్ర బిజెపి నేత చర్చించి పార్టీలో చేరాలని కోరినట్లు సమాచారం. మూడు భాషలు తెలిసిన ఆమెను.. తమిళనాడు, కర్నాటక, కేరళలో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని సూచించగా తాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. తాజా అవమాన పరిణామాలతో కవిత బిజెపిలో చేరేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఆమె తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.