రాష్ట్రీయం

టూరిజం హబ్‌లుగా పులికాట్, నేలపట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 9: అంతర్జాతీయ స్థాయిలో ఫ్లెమింగో ఫెస్టివల్‌కు గుర్తింపు తెచ్చి పులికాట్, నేలపట్టు ప్రాంతాలను టూరిజం హబ్‌లుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. శనివారం ఆయన సూళ్లూరుపేటలో జరిగే పక్షుల పండుగను రోడ్డు భవనాల శాఖమంత్రి శిద్దా రాఘవరావుతో కలసి ఘనంగా ప్రారంభించారు. వారు స్థానికులతో కలసి వచ్చి పక్షుల పండుగను రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. అనంతరం మైదానంలో ఫ్లెమింగో బెలూన్‌ను ఎగరవేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాల్స్‌లను ప్రారంభించి తిలకించారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పులికాట్ సరస్సు, నేలపట్టు ఉన్నందున సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చే పక్షుల కోసం పక్షుల పండుగ నిర్వహించి ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో పులికాట్, నేలపట్టు ప్రాంతాలతో పాటు ఇరకం, వేనాడు, మైపాడు బీబ్ తదితర ప్రాంతాలను టూరిజం హబ్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఈప్రాంతాల్లో అభివృద్ధిపనులకు 60కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. వచ్చే పక్షుల పండుగ లోపు ఇవన్ని పూర్తిచేసేలా చొరవతీసుకొంటామన్నారు. మన దేశంలో పర్యాటరంగ అభివృద్ధికి అన్ని వనరులున్నా వాటిని వినియోగించుకోకపోవడంతో టూరిజంలో బాగా వెనకబడి ఉన్నామన్నారు. పులికాట్ సరస్సు పూడికతీతకు ఎన్‌టిఐ అనే జాతీయ సంస్థకు సర్వేకు అప్పగించామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఆర్‌అండ్‌బిమంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ టూరిజంలో రాష్ట్రాన్ని మొదటి స్థానాకి తేవడానికి ముఖ్యమంత్రి చొరవతీసుకుంటున్నారన్నారు. అనేక సుందర ప్రాంతాలకు నెలవైన నెల్లూరును పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, జిల్లా కలెక్టర్ జానకి ప్రసంగించారు.