ఆంధ్రప్రదేశ్‌

కాపులకు రిజర్వేషన్లు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 29: రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించటం ద్వారా బిసి రిజర్వేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం రాకుండా చూస్తానని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. మహానాడు మూడోరోజైన సోమవారం సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసం అన్న అంశంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై చంద్రబాబు మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన కమిషన్ త్వరలోనే నివేదిక ఇస్తుందని అన్నారు. బిసిల రిజర్వేషన్లకు భంగం కలగకుండా, కాపులను బిసిల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాపులు రాజకీయ రిజర్వేషన్లు కోరుకోవడం లేదని, ఉద్యోగ అవకాశాల కోసం వారు రిజర్వేషన్ కావాలనుకుంటున్నారని సిఎం చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్‌లో కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ఘనత టిడిపికే దక్కిందని ఆయన చెప్పారు. ఈ తీర్మానంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వెనకబడిన
తరగతుల వారికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలను ఉక్కుపాదంతో అణచివేశాయని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలకు, మైనార్టీలకు టిడిపి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని మంత్రి చెప్పారు. బిసిలకు ఇప్పుడున్న రిజర్వేషన్లకు నష్టం వాటిల్లితే, తాము పార్టీలో ఉండడమే దండగ. బిసిలకు అన్యాయం జరగకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు. త్వరలోనే బిసిల్లోని అన్ని కులాల వారిని ఒకే వేదిక మీదకు తీసుకువస్తామని ఆయన చెప్పారు. పార్టీ సీనియర్ నాయకురాలు ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ చంద్రన్న కానుకల్లో చీర-్ధవతి అందించాలని సూచించారు. మహిళా రైతు కూలీలకు సైకిళ్లు ఇవ్వాలని సూచించారు. బ్రాహ్మణ సంక్షేమ నాయకుడు సూర్య మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే, బ్రాహ్మణులకు ప్రభుత్వపరంగా గుర్తింపు లభించిందన్నారు. అర్చకులను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకురాని పరిస్థితి ఉంటే, చంద్రబాబు ఆలోచన చేసి, అర్చకులను పెళ్లిచేసుకున్న అమ్మాయిలకు ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు ఆమె పేరున డిపాజిట్ చేస్తారని, ఐదేళ్ల తరువాత ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తీసుకునే అవకాశం కల్పించారని సూర్య తెలియచేశారు.

చిత్రం... కాపులకు రిజర్వేషన్లు తీర్మానంపై మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు