రాష్ట్రీయం

వానలే వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. మంగళవారం కేరళ, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. గత మూడురోజుల్లో పెద్దగా కదలికలేని రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది. కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన తర్వాత రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మరో మూడు రోజుల్లో ఇవి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి తెలిపారు. రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించిన రెండు మూడు రోజుల్లోనే తెలంగాణలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ, కేరళ,
కర్నాటక, విదర్భ, చత్తీస్‌గఢ్, కొంకణ్, గోవా, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల గత 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ, బోధ్ (ఆదిలాబాద్)లలో ఏడేసి సెంటీమీటర్లు, చోడవరం (విశాఖ)లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇక తిరుపతి, తిరుమలో కుంభవృష్టి కురిసింది. భారీవానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో కపిలతీర్థం, మాల్వాడిగుండం పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వాన కురియడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపించాయి. బుధవారం కూడా కోస్తాంధ్రలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవి రుతుపవనాలు వచ్చే ముందు కురిసే వర్షాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉండగా మంగళవారం బాపట్లలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.
98శాతం వర్షపాతం
2017 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత దేశంలో సరాసరి వర్షంతో పోలిస్తే 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి సైంటిస్ట్ ఎం మహాపాత్ర తెలిపారు. దేశంలో నైరుతీ రుతుపవనాల మూలంగా 89 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, ఈ పర్యాయం నాలుగు శాతం అటు ఇటుగా 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.