రాష్ట్రీయం

పెట్టుబడులు 1.95 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. తొలిరోజే సిఐఐ సదస్సు సూపర్ హిట్టయ్యింది. రాష్ట్భ్రావృద్ధికి లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలన్న ఆంధ్ర సంకల్పానికి బలమైన బీజమే పడింది. తొలిరోజే 1.95లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలకు లాభాలు పంట పండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజే పలువురు పారిశ్రామికవేత్తలతో 32 ఎంవోయులపై ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాతో 94,748 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ప్రకటించారు. రిలయన్స్, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, దివీస్‌లాంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్‌ను మార్చగలవన్న ధీమా వ్యక్తమవుతోంది. సౌర విద్యుత్ సాధనలో టాప్‌గేర్‌లో ఉన్నామని, కాలుష్య నివారణలో భాగంగా విద్యుత్, బ్యాటరీ వాహనాల కొనుగోలుపై పన్ను రాయితీ ఇవ్వాలని నిర్ణయించామని బాబు ప్రకటించారు. సంస్కరణలను విద్యుత్ రంగానికే పరిమితం చేయకుండా, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనూ ప్రవేశపెట్టి ప్రపంచ మేటి స్థానం సాధిస్తామని ప్రకటించారు. మరింత శ్రమించి రాష్ట్రంలో వృద్ధి రేటును 14 శాతానికి పెంచే సంకల్పంతో ఉన్నామన్నారు. పాతకాలంనాటి భూసేకరణ చట్టాలను పక్కనపెట్టి, అభివృద్ధి నిర్మాణంలో ప్రజలనూ భాగస్వాములు చేసేందుకు భూసమీకరణ చట్టాన్ని ప్రతిపాదించే యోచన ఉందన్నారు. మొత్తంమీద తొలిరోజు సిఐఐ సదస్సు సూపర్ హిట్ అనిపించుకోవడంతో రాజకీయ,
అధికారవర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

విశాఖపట్నం, జనవరి 10: రాష్ట్రంలో 1,95,457 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలు లాభాలు ఆర్జించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో సిఎం చంద్రబాబు నాయుడు కీలక ఉపన్యాసం చేశారు. ఆదివారం పలువురు పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పారు. తొలి రోజు 32 ఎంఓయులపై సంతకాలు జరిగాయని ఆయన చెప్పారు. వీటి ద్వారా 94 వేల 748 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలియచేశారు. రిలయన్స్, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, దివీస్, తదితర సంస్థలతో ఒప్పందాలు కుదిరాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను పూర్తిగా నివారించామని చంద్రబాబు చెప్పారు. సౌర విద్యుత్‌ను వినియోగించే విషయంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చంద్రబాబు చెప్పారు. కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్, బ్యాటరీలతో నడిచే వాహనాలను కొనుగోలు చేసే వారికి పన్ను రాయితీ ఇవ్వాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. అలాగే తక్కువ విద్యుత్‌ను వినియోగించే పంపుసెట్లను ఏర్పాటు చేయడానికి కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన తెలియచేశారు. దీనివల్ల 1200 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఆదా అవుతుందని ఆయన అన్నారు. సంస్కరణలను కేవలం విద్యుత్ రంగానికే పరిమితం చేయకుండా, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కూడా ప్రవేశపెట్టి, ప్రపంచ దేశాలతో పోటీ పడతామని ఆయన చెప్పారు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఈ సిఐఐ సదస్సుతో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కబోతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించామని, పాత కాలపు నిబంధనలను పూర్తిగా తొలగించి, పరిశ్రమల స్థాపనను సరళతరం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసే విధంగా సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, రవాణా సదుపాయం, తదితర వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని, వీటిని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకుని రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికాంకారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పలు కీలక నిర్ణయాల ఫలితంగా వృద్ధి రేటు 11కు పెరిగిందని, మరింత శ్రమించి, దీన్ని 14 శాతానికి పెంచాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూ సేకరణ విధానానికి స్వస్తి పలికి భూ సమీకరణను అమలు చేస్తున్నామన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. అలాగే భోగాపురంలో ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని తెలిపారు.
అవకాశాలు పుష్కలం: నిర్మలా సీతారామన్
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వసతులు, వనరులతో పాటు సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబాబు రూపంలో ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్న చంద్రబాబు తపన అనితర సాధ్యమని, దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపిలు అవంతి శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు, ఢిల్లీలో ఎపి ప్రతినిధి కంభంపాటి, రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, అచ్చెన్నాయుడు, సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు.

600 బి టు బి ఒప్పందాలు
సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ

విశాఖపట్నం, జనవరి 10: విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో సుమారు 600 వరకూ బిజినెస్ టు బిజినెస్ (బి టు బి) ఒప్పందాలు జరుగుతాయని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలియచేశారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఆదివారం ప్రారంభోపన్యాసం చేసిన ఆయన 1995లో సిఐఐ భాగస్వామ్య సదస్సుల నిర్వహణ ప్రారంభమైందన్నారు. 1990లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు సదస్సులు నిర్వహించామని, వాటి ఫలితంగానే హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. భారత పరిశ్రమల మంత్రిత్వశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖలను సమన్వయం చేసుకుంటూ దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో 41 దేశాలకు చెందిన 350 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని బెనర్జీ తెలియచేశారు. అమెరికా, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సూడాన్, ఇరాన్, తదితర దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారన్నారు. అమెరికా, చైనా నుంచే 40 మందికి పైగా హాజరుకావడం ఆశించదగ్గ పరిణామమని ఆయన అన్నారు.
త్రైపాక్షిక చర్చలు
ఇదిలా ఉండగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో బంగ్లాదేశ్, నేపాల్ దేశ ప్రతినిధులతో త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ మంత్రి తొఫైల్ అహ్మద్, నేపాల్ వాణిజ్య శాఖ మంత్రి దీపక్ బోరా పాల్గొన్నారు.

విద్యుత్ రంగంలో
1.50 లక్షల కోట్ల ఒప్పందాలు
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్

విశాఖపట్నం, జనవరి 10: విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో విద్యుత్ రంగంలో 1.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి పియూష్ గోయల్ తెలియచేశారు. భాగస్వామ్య సదస్సు తొలి రోజు ఆదివారం కార్యక్రమంలో పార్ట్నర్‌షిప్ ఫర్ ఎ షేర్డ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ ఎకానమీ అన్న అంశంపై గోయల్ మాట్లాడారు. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలియచేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించారన్నారు. సంప్రదాయ విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ సోలార్ హబ్‌గా ఎదగబోతోందని ఆయన తెలియచేశారు. ఈ సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు విశాఖను గమ్యస్థానంగా ఎంచుకున్నారని గోయల్ అన్నారు.
ప్రధాన వాణిజ్య భాగస్వామి చైనా
చైనాలోని గుజో ప్రభుత్వ ఉప గవర్నర్ చెన్ మింగ్ మింగ్ మాట్లాడుతూ చైనా- ఇండియా భాగస్వామ్యం ఆవశ్యకతను వివరించారు. కాకినాడ తదితర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నామని ఆయన చెప్పారు. గోద్రేజ్ కంపెనీ అధినేత ఆది గోద్రేజ్ మాట్లాడుతూ పెట్టుబడిదారులు గతంలో పాశ్చాత్య దేశాల వైపు చూసేవారని, కానీ ఇప్పుడు తూర్పు దేశాలపై వారు దృష్టి సారించారని అన్నారు.

ప్రపంచ బ్యాంక్ ర్యాంక్
ఈసారి సులభం కాదు
డిఐపిపి కార్యదర్శి అమితాబ్ కాంత్

విశాఖపట్నం, జనవరి 10: ఈసారి ప్రపంచ బ్యాంక్ ర్యాంక్ సాధన అంత సులభంగా ఉండదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ (డిఐపిపి) కార్యదర్శి అమితాబ్ కాంత్ అన్నారు. గత ఏడాది ఇచ్చిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని ఆక్రమించుకుందని చెప్పారు. వచ్చే ఏడాది ఈ ర్యాంకు సాధన విషయంలో కొన్ని కఠిన పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. ఈసారి 340 పాయింట్స్ పెడుతున్నామని ఆయన చెప్పారు. మంచి ర్యాంక్ సాధించాలంటే గుజరాత్ మరింత కష్టపడాలని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక వృద్ధి రేటును శాసించే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని అన్నారు. భూమి, పోర్టులు, నిష్ణాతులైన కార్మికులు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నందున పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. త్వరలోనే చెన్నై-బెంగళూరు, చెన్నై-విశాఖపట్నం కారిడార్‌లు కార్యరూపం దాల్చనున్నాయని ఆయన చెప్పారు.
పెట్టుబడుల కోసం బాబు తపన: జిఎంఆర్
జిఎంఆర్ అధినేత జిఎం రావు మాట్లాడుతూ తమ సంస్థ 17 రాష్ట్రాల్లో, ఆరు దేశాల్లో పెట్టుబడులు పెట్టిందని అన్నారు. వనరులు, మ్యాన్‌పవర్, గుడ్ గవర్నెన్స్, పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న రాష్ట్రాల్లోనే పెట్టుబడిదారులు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తారని అన్నారు.
రాష్ట్రంలో సంవత్సరానికి 70 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని దేశాలు తిరుగుతున్నారని, మిగిలిన సిఎంలు కూడా ఇప్పుడు ఆయనను అనుసరిస్తున్నారని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ విశాఖ ప్రాముఖ్యత గురించి వివరించారు.

తయారీ రంగంలో
భారత్ నెంబర్ వన్
భారత్ ఫోర్జ్ సిఎండి బాబా కళ్యాణి

విశాఖపట్నం, జనవరి 10: రానున్న 15 సంవత్సరాల్లో తయారీ రంగంలో భారత దేశం నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని భారత్ ఫోర్జ్ సిఎండి, సిఐఐ నేషనల్ కమిటీ ఆన్ డిఫెన్స్ చైర్మన్ బాబా కళ్యాణి తెలియచేశారు. సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు తొలిరోజు ఆదివారం సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తయారీ రంగంలో అనేక బహుళజాతి సంస్థలు భారత దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు భూమి కొరత లేదన్నారు. అలాగే మానవ వనరులు, విద్యుత్ సమస్య లేనందున పారిశ్రామికవేత్తలంతా ఈ రాష్ట్రంవైపు చూస్తున్నారని చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని భారత్ ఫోర్జ్ సంస్థ ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని చెప్పారు. నెల్లూరులో 1200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ కాంపొనెంట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందులో మూడు వేల మందికి ప్రత్యక్షంగా, మరో 3000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. అలాగే అనంతపురంలో డిఫెన్స్, ఏరోస్పేస్ కాంపొనెంట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి భూసేకరణ పూర్తయిందని బాబా కళ్యాణి తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక వ్యవస్థకు
పారిశ్రామికరంగమే కీలకం
టిఐఎల్ లిమిటెడ్ సిఎండి,
సిఐఐ అధ్యక్షుడు సుమిత్ ముజుందార్

విశాఖపట్నం, జనవరి 10: దేశ ఆర్థిక వ్యవస్థను పారిశ్రామిక రంగం ఎంతగానో ప్రభావితం చేస్తుందని సిఐఐ (కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) అధ్యక్షులు, టిఐఎల్ లిమిటెడ్ సిఎండి సుమిత్ ముజుందార్ అన్నారు. విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో ఆదివారం ఆయన స్వాగతోపన్యాసం చేశారు. గత నెలలో పారిస్‌లో జరిగిన సదస్సుకు మన దేశం నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారన్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలను కనుగొనే విషయంలో అక్కడ స్థూలంగా చర్చించారన్నారు. ఇంటర్ కనెక్టివిటీ, ఇంటర్ డిపెండెన్సీ అవసరమని ఆ సదస్సులో పాల్గొన్న వారంతా తేల్చి చెప్పారన్నారు. ఇందుకు స్వచ్ఛందంగా కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందఅన్నారు. 2003-2009 మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందన్నారు. భారతదేశం వీటన్నింటినీ తట్టుకుని నిలబడినప్పటికీ, దాని ప్రభావం ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతో కొంత కనిపిస్తోందన్నారు. దీని నుంచి బయటపడాలంటే దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముజుందార్ అన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డిజైనింగ్, మార్కెటింగ్, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రానున్నాయని ఆయన చెప్పారు. భారీ పెట్టుబడులపైనే దృష్టిసారించకుండా, చిన్న చిన్న పెట్టుబడులను కూడా రాబట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నంలో ఆదివారం ప్రారంభమైన భాగస్వామ్య సదస్సు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్, అశోక్‌గజపతిరాజు, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, తదితరులు.. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఓయుపై సంతకాలు చేస్తున్న దృశ్యం