రాష్ట్రీయం

జీఎస్టీతో అదనపు ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: వచ్చే నెల జూలై నుంచి అమలులోకి రానున్న ఏకీకృత పన్ను విధానం (జిఎస్‌టి) వల్ల రాష్ట్రానికి అదనంగా రూ. 9 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆదాయ పన్ను వృద్ధి రేటులో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణకు ఏకీకృత పన్ను విధానం వల్ల నష్టం వాటిల్లుతుందని మొదట ప్రభుత్వం అంచనా వేసింది. అయితే వృద్ధి రేటు 14శాతం కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు కేంద్రం అదనంగా కొంత మొత్తం ఇవ్వనున్నట్టు ప్రకటించడంతో రాష్ట్రానికి జిఎస్‌టి వల్ల లాభమే తప్ప నష్టం ఉండదని తాజాగా ఆర్థికశాఖ భావిస్తోంది. జిఎస్‌టి అమలు వల్ల వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీని వల్ల మేలే జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ వివరించారు. జిఎస్‌టి అమలుపై వ్యాపార, వాణిజ్య వర్గాలకు అవగాహన కల్పించేందుకు గురువారం రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య పన్ముల శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో సిఎస్ ఎస్‌పి సింగ్ ప్రసంగించారు. నిరుడు రాష్ట్రానికి పన్నుల రూపంలో రూ. 36వేల కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ 9వేల కోట్లు పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 17శాతం వృద్ధి రేటు సాధించిందన్నారు. కొత్త పన్నుల విధానం అమలులోకి రావడం వల్ల తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామన్నారు. జిఎస్‌టి జూలై ఒకటి నుంచి అమలులోకి రానుండటంతో ఈ నెలాఖరుకల్లా వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ విషయంలో వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఎలాంటి సందేహాలు ఉన్నా తీర్చడానికి ప్రభుత్వం తరపున అవగాహన, సహాకారం అందిస్తామని ఎస్‌పి సింగ్ తెలిపారు. రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ మాట్లాడుతూ, ఇక నుంచి కేంద్రం, రాష్ట్రం ఒకే పన్ను విధించడం వల్ల పారిశ్రామిక వర్గాలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ జిఎస్‌టిపై పారిశ్రామిక వర్గాలకు పూర్తి అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చిత్రం.. వ్యాపార ప్రతినిధులతో సిఎస్ ఎస్‌పి సింగ్