రాష్ట్రీయం

ఆంధ్రాలో ఏరువాక దిగ్విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 9: ఆంధ్రప్రదేశ్‌లో ఏరువాక దిగ్విజయంగా సాగుతోందని, వర్షాలు బాగా పడి రాష్ట్రం కళకళలాడాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం కలిసిన ఆయన, ఈ నెల 18న జరగనున్న తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందచేశారు. రాష్ట్ర శాసనసభాపతి కోడెల శివప్రసాదరావును విజయవాడలో కలిశారు. అనంతరం ఆయన వెలగపూడిలోని సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈసందర్భంగా ఈటెల విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని అమరావతికి భూమిపూజ జరిగినప్పుడు వచ్చానని, మూడేళ్ల కాలంలోనే మంచి అభివృద్ధి జరిగిందని కితాబిచ్చారు. అన్నదమ్ములు విడిపోతేనే సమస్యలు వస్తుంటాయని, అలాంటిది రాష్ట్రాల మధ్య సమస్యలు పెద్ద సమస్య కాదన్నారు. రాష్ట్ర విభజన ముగిసిన అంశమని, చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉన్నమాట వాస్తవమేనని, అయితే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విభజన సమస్యల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయన్నారు. అమరావతి రాజధాని మరో రెండు, మూడేళ్లలో అందంగా రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ రూ.1.6 లక్షల కోట్ల రూపాయలు ఉండేదని, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ 3లక్షల కోట్ల రూపాయలు దాటిందని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నాయన్నారు. జిఎస్టీ వల్ల సామాన్యులకు అన్యాయం జరగకుండా ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలిసి పోరాడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బియ్యంపై పన్ను ఉన్నా ఎవరూ కట్టడం లేదని గుర్తుచేశారు. దేశంలో ఒకే పన్ను విధానం ఉండాలని తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాయని చెప్పారు. ఈ నెల 11న జరిగే జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రజల అభ్యంతరాలు తెలియచేస్తామన్నారు. పన్ను ఎగవేతకు ఆస్కారం లేనివిధంగా చట్టం ఉండాలన్నారు. గ్రానైట్, బీడీలపై పన్నులు అభ్యంతరకరంగా ఉన్నాయని, ప్రభు త్వం చేపట్టే అభివృద్ధి పనులపై పన్నులు వద్దని కోరినట్లు ఈటెల వివరించారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన కుమారుని వివాహ
ఆహ్వాన పత్రిక అందజేస్తున్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్