రాష్ట్రీయం

పండుగలా ఏరువాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 9: తొలకరికి స్వాగతం పలుకుతూ నేలతల్లికి పూజలు చేసి విత్తనాలు విత్తేందుకు రైతన్నలు సంప్రదాయంగా నిర్వహించే ఏరువాక పౌర్ణమిని వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండవలా ఘనంగా నిర్వహిస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74-ఉడేగోళంలో శుక్రవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమిలో సిఎం పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తానూ రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తనకు తెలుసన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఏరువాకను పండుగలా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే దేశంలో అత్యంత వెనుకబడిన రెండో జిల్లా అయిన అనంతపురాన్ని ఎంచుకున్నామన్నారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన రాయదుర్గం మండలంలో ఏరువాక ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది ఏరువాకను రాష్ట్రోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు సమయంలో షూట్ (తరుగు) తీసుకునే వారు నేటినుంచి ఉండటానికి వీల్లేదన్నారు. షూట్, కమిషన్ తీసుకునే దళారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ‘రాయలసీమను ఎట్టి పరిస్థితుల్లో రాళ్లసీమ కానీయను. కేవలం 12 నెలల్లోనే పట్టిసీమను పూర్తి చేశాం. పట్టిసీమ పూర్తయితే పదవులకు రాజీనామాలు చేస్తామన్న వారంతా ఇంకా సిగ్గులేకుండా కొనసాగుతూనే ఉన్నారు’ అంటూ పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించామని, త్వరలో కృష్ణా-పెన్నాలను అనుసంధానిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని బాహుబలి తరహాలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. వ్యవసాయం పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలన్నారు. విత్తన సబ్సిడీని 33శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నామన్నారు. కలుపు తీసేందుకు హెక్టారుకు రూ.500, రసాయనాలకు రూ.500, ఎంఎస్‌పి రూ.200 ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. నీటి సంరక్షణ అందరి బాధ్యతని, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకుని ప్రతి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం విరివిగా చెట్లు చాటాలని, పంట కుంటల్ని ప్రతి రైతూ తవ్వుకోవాలని కోరారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని సిఎం ప్రకటించారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో సోలార్ విద్యుదుత్పత్తి జరుగుతుందని, సాగుకు పగలే కరెంటు ఇస్తామన్నారు. హంద్రీనీవాను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. అనంతపురం హార్టికల్చర్ హబ్‌గా తయారవుతోందని, విదేశాల్లో సైతం పండ్లు అనంతపురం నుంచి వచ్చాయని చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు ఆగస్టు 15న శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే పేరూరు డ్యామ్‌ను పూర్తి చేస్తామని, రూ.450 కోట్ల వ్యయంతో ఆధునికీకరిస్తున్న హెచ్చెల్సీ పనుల్ని పూర్తి చేస్తామన్నారు. పంటలు నష్టపోకుండా ఈ ఏడాది కూడా రెయిన్‌గన్స్ ద్వారా నీరందించి ఆదుకుంటామన్నారు. రూ.1020 కోట్లతో భూములకు మైక్రో న్యూట్రియన్స్ అందిస్తామన్నారు. రాష్ట్రంలో అగ్రికల్చర్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కోస్తాలో పత్తి సాగు తగ్గించాలని రైతులను కోరారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించి, అవినీతి రహితపాలన అందిస్తామన్నారు. సభలో మంత్రులు కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పరిటాల సునీత, జిల్లా టిడిపి అధ్యక్షుడు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ, కలెక్టర్ జి వీరపాండ్యన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

చిత్రం.. ఏరువాకలో భాగంగా కాడెద్దులతో దుక్కి దున్నుతున్న సిఎం చంద్రబాబు