రాష్ట్రీయం

కావాలనే సర్వర్ డౌన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 9: ప్రధాన సర్వర్ పనిచేయకపోవటంతో రెండోరోజు శుక్రవారం కూడా రాష్టవ్య్రాప్తంగా 291 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు అన్నిరకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వరుసగా రెండ్రోజులు స్థిరాస్తి క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. భూములు, స్థలాలు, భవనాల కొనుగోలుదారులు, అమ్మకందారులు, వీరిమధ్యలో సాక్షి సంతకాలు చేసేందుకు వచ్చినవారంతా సర్వర్ పనిచేయక పోవటంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఖర్చులు, విలువైన సమయం వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యేష్ఠమాసం.. శుభ కార్యాలకు అనువైన రోజులు కావటంతో వివాహాలు, ఆస్తుల కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లకు ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇలాంటి సమయాల్లో సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. ఇక వేల సంఖ్యలో వున్న మీ సేవ కేంద్రాలూ వెలవెలబోతున్నాయి. రాష్టవ్య్రాప్తంగా సగటున రోజుకు 10 నుంచి 15 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటివల్ల ప్రభుత్వానికి కనీసం 10 కోట్ల ఆదాయం సమకూరుతుంది. రెండురోజులు రిజిస్ట్రేషన్లు లేక రూ.20 కోట్ల మేర ఆదాయానికి గండిపడింది. బ్యాంకుల్లో చలానా కట్టినవారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గత నెలలోనూ మూడు రోజులు సాంకేతిక సమస్యలు ఎదురుకావటంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఆస్తుల కొనుగోలు, అమ్మకందారుల వేలిముద్రలు, ఫొటోలు, దస్తావేజులు, ఆధార్ నెంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. అదే వ్యవసాయ భూములైతే వెబ్‌ల్యాండ్‌కు వెళ్లి సర్వే నెంబర్లు, భూముల రకాలను సరిచూసుకోవాల్సి ఉంది. వీటికి సంబంధించి సర్వర్లు పనిచేయక మొరాయిస్తుండటంతో సేవలన్నీ స్తంభించిపోయాయి. రిజిస్ట్రేషన్ రంగంపై ఆధారపడ్డ వృత్తిదారులు, అనుబంధ వృత్తిదారులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో అన్నారు. ఇదిలావుంటే ప్రధాన సర్వర్ పనిచేయకపోవటంపై విభిన్న వదంతులు వినిపిస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే ‘ఎన్‌ఐసి’ మాత్రం సర్వర్లలో సమాచారం పూర్తిగా నిండిపోయిందని, స్పేస్ లేకపోవటం వల్ల సర్వర్ నిలిచిపోయిందని చెబుతున్నారు. అయితే విశాఖపట్టణం, మరికొన్ని ప్రాంతాల్లో భూకుంభకోణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో విపక్షాల చేతికి విలువైన డాక్యుమెంట్ కాపీలు దొరక్కుండా చేసేందుకు ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా సర్వర్ నిలిపివేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అమరావతి భూములపై విపక్షాలు విలువైన పాత డాక్యుమెంట్ల కాపీలను సేకరిస్తున్న సమయంలో ప్రభుత్వం నాలుగురోజులు ప్రధాన సర్వర్‌ను నిలిపివేసిందని ఒక ఉన్నతాధికారి అన్నారు.

చిత్రం.. రద్దీగా వుండే విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలవెలబోతున్న దృశ్యం