రాష్ట్రీయం

రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 9: బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా భారతీయ రైల్వే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు నిర్వహించలేక, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించలేక చతికిలపడుతున్న రైల్వే, నష్టాలను కూడా ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి గట్టెక్కే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని 17 రైల్వే జోన్లకు సంబంధించి 13 రైల్వేజోన్ల పరిధిల్లో ఉన్న 23 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి, పునర్నిర్మాణం, వాణిజ్య అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 45 ఏళ్ళపాటు స్టేషన్ ఫెసిలిటేషన్ మేనేజర్స్ (ఎస్‌ఎఫ్‌ఎం) కింద పిపిపి పద్ధతిలో నిర్వహించేందుకు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. అతి ముఖ్యమైన రైళ్ళ నిర్వహణ, పార్శిల్ టికెటింగ్, ప్లాట్‌పారం టికెట్లు, పాసింజర్, గూడ్స్ రైళ్ళ పరిశీలన వంటివి పిపిపి పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఓవర్‌హెడ్ ట్రాకింగ్, సిగ్నల్ అండ్ టెలికామ్ విభాగాల్లో సేవలు పిపిపి విధానం అమలుకానుంది. ఈ విధంగా సెంట్రల్ రైల్వేజోన్ పరిధిలో ముంబయి, పూణే, లోక్‌మాన్య తిలక్ టెర్మినల్, థానే రైల్వే స్టేషన్లలో రూ.650 కోట్ల విలువైన పనుల అభివృద్ధికి, పునర్నిర్మాణానికి భారతీయ రైల్వే టెండర్లను ఆహ్వానించింది. అలాగే ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ వాల్తేర్ డివిజన్ పరిధిలోకి వచ్చే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో రూ.200 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్లను పిలిచింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లు, సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే బెంగళూరు, చెన్నై, పాల్‌ఘాట్, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో భోపాల్, తదితర రైల్వే స్టేషన్లల్లో రూ.2061 కోట్ల నిధుల విలువైన పనుల కోసం టెండర్లు పిలిచే ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈస్ట్రన్ రైల్వే, నార్త్‌సెంట్రల్, నార్త్ వెస్ట్రన్, నార్త్‌ఈస్ట్‌ప్రాంటియర్ రైల్వేజోన్ల పరిధిలోకి వచ్చే హౌరా, అలహాబాద్, కాన్పూర్, ఉదయపూర్, కామాక్యా, జమ్ము, ఫరిదాబాద్ డివిజన్లకు చెందిన రైల్వే స్టేషన్లు పిపిపి పరిధిలోకి వస్తున్నాయి. వీటన్నింటికీ సంబందించిన పనుల కోసం రైల్వే రూ.1223 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పారిశుద్ధ్యం, రిజర్వేషన్, పార్కింగ్, విచారణ కేంద్రం, లాండ్రీ, పాంట్రీ సేవలు ఇప్పటికే ప్రైవేటీకరణ కాగా, అతి ముఖ్యమైన మరికొన్ని సేవలన్నింటినీ దశల వారీగా ప్రైవేటీకరించే క్రమంలో రైల్వే చర్యలు వేగవంతం చేస్తోంది. రైల్వే స్టేషన్లలో నిర్దేశించిన ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా వాణిజ్య సముదాయాలు అభివృద్ధి చెందడంతోపాటు అన్ని రకాలైన సేవలు ప్రయాణికులకు అందించినట్టు అవుతుంది. ఈ క్రమంలో రైల్వేకు ఊహించిన దాని కంటే కూడా అదాయం సమకూరుతుంది. అందువల్ల తొలుత భారతీయ రైల్వేలో కొన్ని రైల్వేస్టేషన్లల్లోనే పిపిపి విధానం అమలు చేసి ఫలితాలను బట్టి మరికొన్ని రైల్వేస్టేషన్లలో దీనిని అమల్లోకి తీసుకురావాలని రైల్వే నిర్ణయించింది. అయితే తొలి దశలోనే డివిజన్, జోన్ల స్థాయిలో పిపిపి విధానాన్ని ప్రజా సంఘాలు, రైల్వే కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో నిరసిస్తున్నాయి. అయితే ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందివ్వడం, నష్టాల నుంచి బయటపడి రైల్వేకు నిధులు సమకూర్చుకునేందుకు దీనిని అమల్లోకి తీసుకువస్తున్నట్టు రైల్వే స్పష్టం చేస్తోంది.