రాష్ట్రీయం

విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 9: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ఆనుకుని అల్పపీడనం ఏర్పడినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. ఇది స్థిరంగా, బలంగా ఉన్నట్టు చెప్పారు. దీని ప్రభావం వలన రానున్న రెండు రోజుల్లో రాష్టమ్రంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అల్పపీడన ప్రభావం వలన దక్షిణ కోస్తా అంతటా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం మంచిది కాదని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. విశాఖలో 3 సెం.మీ వర్షం కురిసింది. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి అనంతపురం నుంచి నెల్లూరు వరకూ విస్తరించాయి. ఇవి శని, ఆదివారాల్లో విశాఖను తాకుతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు.

చిత్రం.. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టపగలు వర్షపు నీటిలో లైట్లు వేసుకుని వెళ్తున్న వాహనాలు