రాష్ట్రీయం

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10: గ్రామ స్వరాజ్యంపై మహాత్మాగాంధీ కలలను సాకారం చేస్తున్న ఘనత దేశంలో ఒక్క ఎన్డీయేకే దక్కుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దశాబ్దకాలం క్రితం అటల్‌బిహారీ వాజ్‌పాయ్ నాయకత్వంలో ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద గ్రామాలను అనుసంధానించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. నేటి ప్రధాని నరేంద్రమోదీ గ్రామాల్లో వెలుగునింపే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో 8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పలు రకాల భవనాలతో రూపుదిద్దుకున్న స్వర్ణ్భారత్ ట్రస్టును కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. సభకు వెంకయ్యనాయుడు కుమార్తె, ట్రస్టు మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ దీపవెంకట్ అధ్యక్షత వహించారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన జన్‌ధన్ యోజన పథకం కింద 76శాతం మంది పేదలకు జీరో బ్యాంకు బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతాలను తెరిపించటమే గాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ఇచ్చే సబ్సిడీలన్నింటినీ నేరుగా వారి ఖాతాలకే జమ చేయటం జరుగుతున్నదన్నారు. దేశంలో వంద పట్టణాలను స్మార్ట్ సిటీలుగాను, 300 గ్రామాలను మోడల్ గ్రామాలుగా అన్ని వౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దేందుకు కేంద్రం నడుంగట్టిందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘అన్నీ ప్రభుత్వమే చేస్తుంది, మనం చేతులు కట్టుకుని చోద్యం చూస్తామనే ధోరణి అభివృద్ధికి మంచిది కాదని, ప్రజల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం లేని అభివృద్ధి అర్ధవంతం కాదనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం లేకుండానే తన కుమార్తె నేతృత్వంలో ఈ స్వర్ణ్భారత ట్రస్టు 15ఏళ్ల క్రితం నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వద్ద ఆవిర్భవించిందన్నారు. కుల, మతాలకు, రాజకీయాలకు ఇక్కడ స్థానం లేదన్నారు. రైతు శిక్షణ, స్వయం ఉపాధి, సాంస్కృతిక వికాసం లక్ష్యాలుగా గత 15 ఏళ్లుగా ఇప్పటికి 15వేల మంది గ్రామీణ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయటం జరిగిందన్నారు. కేవలం 10 మాసాల వ్యవధిలో భవనాల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు అనేకమంది సహకరించారంటూ వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఉగాది నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎంపిలు గోకరాజు గంగరాజు, కేశినేని శ్రీనివాస్ (నాని), రాయపాటి సాంబశివరావు, కొనగళ్ల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.