రాష్ట్రీయం

రికార్డు సృష్టించిన మిడ్‌మానేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: రికార్డు సమయంలో మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను పూర్తిచేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు 2006లో ప్రారంభించారు. పదేళ్ల కాలంలో 50 శాతం పనులు పూర్తి చేస్తే, తెలంగాణ ఏర్పడిన తరువాత 10 నెలల కాలంలో మిగతా 50 శాతం పనులు పూర్తిచేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేసినందుకు ఇంజనీరింగ్ సిబ్బందిని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభినందించారు. 10 నెలల కాలంలో 252 కోట్ల రూపాయల వ్యయంతో పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరులో మొత్తం కాంక్రీట్ వర్క్ 4.8 లక్షల క్యూబిక్ మీటర్లు కాగా, పది నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. పదేళ్ల కాలంలో 65 వేల 200 క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేస్తే, తెలంగాణ ఏర్పడిన తరువాత 3.49 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. మిడ్‌మానేరు అంచనా వ్యయం 639 కోట్లు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పదకొండేళ్లలో 107 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత 358 కోట్లు ఖర్చు చేయగా, గత పనె్నండు నెలల్లో 251 కోట్లు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. ప్రాజెక్టు పరిధిలో పునరావాస పనులు వేగంగా చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పదేళ్లలో జరగని పనిని పది నెలల్లో చేసి చూపించారని మిడ్‌మానేరు ప్రాజెక్టు సిబ్బందిని, అధికారులను మంత్రి అభినందించారు. మిడ్‌మానేరు పనులపై మంత్రి శుక్రవారం సమీక్ష జరిపారు. మరో నెల రోజులే సమయం ఉందని, ఇది చాలా కీలకమని, వర్షాలు పెరిగితే పునరావాస పనులు కష్టమని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. భూనిర్వాసితులకు పరిహారం, పునరావాసం కోసం జిల్లా కలెక్టర్ వద్ద 30 కోట్ల రూపాయల నిధులు పెట్టినట్టు తెలిపారు. ఆర్ అండ్ ఆర్ పనులు జాప్యం చేసినా, నిర్లక్ష్యం చూపించినా సహించేది లేదని హెచ్చరించారు. భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన నిర్వాహితులకు పరిహారం చెల్లింపు చేయాలని కోరారు. మిడ్‌మానేరు కింద ముంపుగ్రామాల్లో పరిస్థితిని మంత్రి సమీక్షించారు. కొన్నిచోట్ల ప్రజలు ఇంకా ఖాళీ చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మిడ్‌మానేరు పరిధిలోని ముంపు గ్రామాలు చింతల్ ఠాణా, కోదురుపాక, శాబాసుపల్లి, కొడిముంజ, చీర్ల వంచ, అనుపురం, ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరద వెళ్లి గ్రామాల నిర్వాసితులకు ఇప్పటి వరకు జరిగిన పరిహారం చెల్లింపులను హరీశ్‌రావు సమీక్షించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్నవి వెంటనే చెల్లించాలని చెప్పారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో 12 గ్రామాలకు చెందిన నిరాశ్రయులైన కుటుంబాలకు పరిహారం వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. 13 ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో యుద్ధ ప్రాతిపదికన కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం పెడింగ్‌లో ఉందని, పూర్తి చేయాలని అన్నారు. నిర్వాసితుల ఇళ్లకు నిధులు మంజూరు చేయాలని హౌజింగ్ ఎండి చిత్రా రామచంద్రన్ ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెసి యాస్మిన్ బాషా, ఇఎన్‌సి మురళీధరరావు, సిఈలు అనిల్, హరిరామ్, ఓఎస్‌డి దేశ్ పాండే పాల్గొన్నారు.